Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

  • July 31, 2026 / 12:57 PM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Cast & Crew

  • శ్రీకాంత్‌ (Hero)
  • NA (Heroine)
  • ముఖేష్ రిషి, అన‌న్య శ‌ర్మ‌, స్నేహ‌ల్ కామ‌త్‌, స‌మీర్ త‌దిత‌రులు (Cast)
  • సంతోష్ అయ్య‌ప్ప‌న్‌ (Director)
  • రాజ్ కుమార్ ఆకేళ్ల‌ (Producer)
  • అరుణ్ చిలువేరు (Music)
  • సూర్య‌ (Cinematography)
  • కిషోర్ (Editor)
  • Release Date : 31st జూలై 2026
  • డ్రీమ్ హౌస్ ప్రొడ‌క్ష‌న్స్‌ (Banner)

సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ (Srikanth) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన వెబ్‌సిరీస్ అబ్జెక్ష‌న్ మై లార్డ్ శుక్ర‌వారం జీ5 ఓటీటీలో రిలీజైంది. ముఖేష్ రిషి, అన‌న్య శ‌ర్మ ముఖ్య పాత్ర‌లు పోషించిన ఈ సిరీస్‌కు సంతోష్ అయ్య‌ప్ప‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. డ్రీమ్ హౌస్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉందంటే?

Objection My Lord Web-Series Review

Objection My Lord Web-Series Review And Rating

క‌థ‌: ప‌ర‌శురామ్ (శ్రీకాంత్‌) ఓ లాయ‌ర్‌. చాలా తెలివితేట‌లు ఉన్నా ఓ కేసులో ఎదురైన ఓట‌మి కార‌ణంగా కోర్టులో వాదించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంటాడు. నోట‌రీగా చిన్న చిన్న ప‌నులు చేస్తూ అప్పుల‌తో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. చివ‌ర‌కు ఫెయిల్యూర్ లాయ‌ర్ అంటూ క‌న్న కొడుకే ప‌ర‌శురామ్‌ను అవ‌మానిస్తాడు. త‌న కూతురు స‌మీరాను (స్నేహ‌ల్ కామ‌త్‌) ఎవ‌రో కిడ్నాప్ చేశార‌ని, ఆమెను కాపాడాల‌ని పోలీసుల‌తో పాటు లాయ‌ర్ల‌ను ప్రాధేయ‌ప‌డ‌తాడు నారాయ‌ణ‌. కానీ ఎవ‌రూ అత‌డి మాట‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో కోర్టు ముందే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. ఆ ఆత్మ‌హ‌త్య కేసును ప‌ర‌శురామ్ కోర్టులో వాదించాల‌ని నిర్ణ‌యించుకుంటాడు.

అత‌డికి ప్ర‌త్య‌ర్థిగా కోర్టులో ఫేమ‌స్ లాయ‌ర్ విశ్వ‌నాథ్ (ముఖేష్ రిషి)ఉంటాడు. ఈ కేసు గురించిన‌ ఎంక్వైరీలో నారాయ‌ణ‌తో పాటు అత‌డి కూతురు స‌మీరా గురించి ప‌ర‌శురామ్‌, అత‌డి అసిస్టెంట్ వేదాకు ఎలాంటి నిజాలు తెలిశాయి? స‌మీరా నిజంగానే కిడ్నాప్ అయ్యిందా? స‌మీరా కేసుకు ఎమ్మెల్యే కొడుకుతో సంబంధం ఉందా? ప‌ర‌శురామ్‌కు ఉన్న ఆరోగ్య స‌మ‌స్య ఏమిటి? లాయ‌ర్ వృత్తికి అత‌డు ఎందుకు దూర‌మ‌య్యాడు? స‌మీరాకు జ‌రిగిన అన్యాయాన్ని ప‌ర‌శురామ్ ఎలా వెలుగులోకి తీసుకొచ్చాడు? ఫేమ‌స్ లాయ‌ర్ విశ్వ‌నాథ్‌ను ఏ విధంగా ఓడించాడు అన్న‌దే ఈ వెబ్ సిరీస్ క‌థ‌.

Objection My Lord Web-Series Review And Rating

న‌టీన‌టుల ప‌నితీరు: నోట‌రీ ప‌ర‌శురామ్ పాత్ర‌లో శ్రీకాంత్ సెటిల్డ్ యాక్టింగ్‌ను క‌న‌రిచాడు. ఫెయిల్యూర్ లాయ‌ర్‌గా, ఆడ‌పిల్ల‌కు జ‌రిగిన అన్యాయంపై పోరాడే వ్య‌క్తిగా డిఫ‌రెంట్ షేడ్స్ తో కూడిన ఎమోష‌న‌ల్ రోల్‌కు పూర్తిగా న్యాయం చేశారు. ఈ సిరీస్ మొత్తాన్ని వ‌న్ మెన్ ఆర్మీగా త‌న భుజాల‌పై న‌డిపించారు. అపోజిష‌న్ లాయ‌ర్‌గాముఖేష్ రిషి క‌నిపించారు. ప‌వ‌ర్‌ఫుల్ అన్న‌ట్లుగా అత‌డి పాత్ర‌ను ప‌రిచ‌యం చేశారు. కానీ ఆయ‌న కోసం రాసిన సీన్లు మాత్రం ఆ స్థాయిలో లేవు.

శ్రీకాంత్ అసిస్టెంట్‌గా అన‌న్య శ‌ర్మ నాచుర‌ల్ యాక్టింగ్‌తో మెప్పించింది. ఈ వెబ్ సిరీస్ క‌థ మొత్తం స‌మీరా పాత్ర చుట్టే తిరుగుతుంది. కానీ ఈ క్యారెక్ట‌ర్ ఆరో ఎపిసోడ్‌లో క‌నిపిస్తుంది. స‌మీరాగా ఎమోష‌న‌ల్ రోల్‌లో స్నేహ‌ల్ కామ‌త్ న‌ట‌న బాగుంది. అవినీతిప‌రులైన‌ పోలీసులుగా స‌మీర్‌, జెమిని సురేష్ ఇలాంటి పాత్ర‌లు కొత్తేమీ కాదు. ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయారు.

Objection My Lord Web-Series Review And Rating

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్‌సిరీస్‌కు సంతోష్ అయ్య‌ప్ప‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఎలాంటి సైడ్ ట్రాక్‌లు, డీవీయేష‌న్లు లేకుండా ప్యూర్ కోర్ట్ రూమ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు. కొన్ని ట్విస్ట్‌లు బాగున్నాయి. చివ‌రి వ‌ర‌కు స‌స్పెన్స్ మెయింటేన్ చేయ‌డంలో మాత్రం పూర్తిగా స‌క్సెస్ కాలేక‌పోయాడు. రాజ్ కుమార్ ఆకేళ్ల‌ ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ ఒకే. అరుణ్ చిలువేరు మ్యూజిక్ బాగుంది. టైటిల్స్ టైమ్‌లో వ‌చ్చే మ్యూజిక్ ఎఫెక్టివ్‌గా అనిపించింది. సినిమాటోగ్ర‌ఫీ నార్మ‌ల్‌గాఉంది.

Objection My Lord Web-Series Review And Rating

విశ్లేష‌ణ‌: శ్రీకాంత్‌, ముఖేష్ రిషి లాంటి సీనియ‌ర్ యాక్ట‌ర్లు చేసిన వెబ్‌సిరీస్ కావ‌డం, మెగాస్టార్ చిరంజీవి ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన‌డంతో అబ్జెక్ష‌న్ మై లార్డ్ ఓటీటీ ఫ్యాన్స్ దృష్టిని ఆక‌ర్షించింది. ఏదో వెరైటీ కాన్సెప్ట్‌తోనే ఈ సిరీస్ రూపొంది ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ టైటిల్‌లో ఉన్న కొత్త‌ద‌నం సిరీస్‌లో క‌నిపించ‌లేదు. కోర్టు ముందే ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం…కూతురు క‌నిపించ‌కుండాపోవ‌డం, ఎలాంటి ఆన‌వాళ్లు లేని కేసు అంటూ ఈ సిరీస్‌ను మొద‌లుపెట్టిన తీరు ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆత్మ‌హ‌త్య చేసుకున్న నారాయ‌ణ అడ్రెస్ రివీల‌య్యే ట్విస్ట్ అదిరిపోతుంది. చిక్కుముడులు విప్పుతూ వెళ్లిన కొద్ది సిరీస్‌లోని ఆస‌క్తి త‌గ్గుతూ వ‌చ్చింది. ఆరంభంలో అద‌ర‌గొట్టిన డైరెక్ట‌ర్ చివ‌ర‌లో మాత్రం తేలిపోయారు.

హీరో విల‌న్లు ఒక‌రిపై మ‌రొక‌రు వేసే ఎత్తులు, పై ఎత్తులు ఎంత బాగా వ‌ర్క‌వుట్ అయితే కోర్టు రూమ్ సిరీస్‌లు అంత‌గా ఆక‌ట్టుకుంటాయి. అలాంటి వావ్ మూవ్‌మెంట్స్ ఒక్క‌టి కూడా ఈ సిరీస్‌లో క‌నిపించ‌వు. మొత్తం ఏడు ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు. ఒక్కోటి 30 నిమిషాల వ‌ర‌కు ఉన్నాయి. స‌మీరా గురించి ప‌ర‌శురామ్‌, వేదా సాగించే ఇన్వేస్టిగేష‌న్ ఓ స్టేజ్ త‌ర్వాత బోరింగ్‌గా అనిపిస్తుంది. హీరోకు త‌గ్గ బ‌ల‌మైన విల‌న్ లేక‌పోవ‌డం, ఉన్న పాత్ర‌ల‌ను స‌రిగ్గా రాసుకోక‌పోవ‌డం మైన‌స్‌గా మారింది.

స‌మీరా మిస్సింగ్ వెనుక ఏదో పెద్ద మిస్ట‌రీ ఉన్న‌ట్లుగా చూపించారు. కానీ ఆ ట్రాక్‌లోని ఎమోష‌న్ అంత‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. ఈ పాయింట్‌తో చాలానే సిరీస్‌లు, సినిమాలు వ‌చ్చాయి. కోర్టు రూమ్‌లో వాద‌న‌ల్లో కిక్ మిస్స‌య్యింది. శ్రీకాంత్ యాక్టింగ్ కోసం ఓ సారి చూడొచ్చు.

Objection My Lord Web-Series Review And Rating

ఫోక‌స్ పాయింట్‌: బోరింగ్‌గా సాగే కోర్ట్ రూమ్ డ్రామా థ్రిల్ల‌ర్‌. ఆరంభ‌మే అదిరింది. చివ‌ర‌లో తేలిపోయింది.

రేటింగ్: 2/5

 

శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

 

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya
  • #Ananya Sharmaa
  • #Mukesh Rishi
  • #Objection My Lord
  • #srikanth

Reviews

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

trending news

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

11 hours ago
‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

12 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

1 day ago
Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

1 day ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

1 day ago
Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

1 day ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

1 day ago
Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

1 day ago
బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version