లెంగ్త్ కంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్ అంటోంది!

  • September 6, 2020 / 04:18 PM IST

“వి”డుదల ముందు రోజు వరకు సినిమాలో అదితిరావ్ హైదరి పాత్రను రహస్యంగా దాచిపెట్టారు. విడుదలకు ముందు రోజు నానితో జంటగా ఉన్న ఫొటోను విడుదల చేయడం ద్వారా అతడికి జోడీగా నటిస్తున్నారని ప్రేక్షకులకు అర్థమైంది. ఓటీటీలో విడుదలైంది కనుక ఆమె పాత్ర ఏంటనేది “వి” చూసినవాళ్ళకు తెలుస్తుంది. సినిమాకు వస్తున్న పట్ల సంతోషంగా ఉన్నానని అదితిరావ్ హైదరి చెప్పింది. సినిమాలో మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ గురించి అదితిరావ్ హైదరి మాట్లాడుతూ “వి” షూటింగ్‌కి వెళ్ళిన మొదటి రోజే నా గొంతుకోసే సీన్ తీశారు. క్లైమాక్స్ మొత్తం షూట్ చేశారు. షార్ట్ టైమ్‌లో క్యారెక్టర్‌కికనెక్ట్ అయ్యి ఆ సీన్ చెయ్యడం ఛాలెంజింగ్ అనిపించింది” అని అన్నారు.

“వి” చూసి ధనుష్, రాశి ఖన్నా, సుభాష్ కె. ఝా మెసేజ్ చేశారని ఆమె తెలియజేసింది. “ధనుష్ సినిమా బాగుంది అన్నాడు. లవ్ ట్రాక్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అన్నాడు. చాలామంది లవ్ సోట్రీ ఇంకా ఎక్కువ ఉంటుందని ఊహించమని చెప్పారు. లవ్ స్టోరీ తక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు కనెక్ట్ కావడం హ్యాపీ” అని అదితిరావ్ హైదరి అన్నది. ఆమెకు ప్రేమకథ కాకుండా పతాక సన్నివేశాలలో నాని సుధీర్ బాబు మధ్య సంభాషణ నచ్చిందట.

తెలుగులో ఓ సినిమా చేస్తున్నానని, నిర్మాతలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని చెప్పింది. క్యారెక్టర్ నచ్చితే నిడివితో సంబంధం లేకుండా సినిమా చేస్తానని తెలిపింది. తెలుగులో ఒకటి తమిళంలో మూడు హిందీలో రెండు సినిమాలు చేస్తున్నానని అదితిరావ్ హైదరి అన్నది.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus