Siddharth,Aditi: ‘మంగళవారం’ గురించి శనివారం ప్రచారం ప్రారంభించారా?

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది? అలాగే ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలో కూడా సోషల్‌ మీడియానే నిర్ణయిస్తుంది అంటుంటారు. అలాగే సోషల్‌ మీడియాలో చేసే ఓ పోస్ట్‌… చాలా మార్పులకు దారి తీస్తుంది అని చెప్పొచ్చు. మిగిలిన వాళ్ల విషయాల్లో ఏమో కానీ.. సినిమా పరిశ్రమలో అయితే కచ్చితంగా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఓ దర్శకుడు పెట్టిన పోస్టు వల్లే ఈ డిస్కషన్‌ మొదలైంది.

కథానాయకుడు సిద్ధార్థ్‌ (Siddharth) ప్రేమ కథల గురించి మీకు తెలిసిందే. ఆయనతో గతంలో స్టార్‌ హీరోయిన్లే ప్రేమలో ఉన్నారు అని అంటుంటారు. అందులో ఒకరిద్దరి పేర్లు బలంగా బయటకు వినిపించాయి. మిగిలిన వాళ్ల పేర్లు పుకార్లకు మాత్రమే పరిమితమయ్యాయి. ఒక హీరోయిన్‌తో అయితే ఏకంగా పెళ్లి వరకు, పెళ్లి ముందు పూజలు వరకు వెళ్లింది. ఆ విషయాలు పక్కనపెడితే ఇప్పుడు మరో హీరోయిన్‌తో సిద్ధు పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు.

ఇదంతా పాత విషయమే కదా… కొత్తగా చెప్పేదేముంది అనుకుంటున్నారా? ఏమో ఈ విషయాన్ని మళ్లీ బయటకు లాగింది దర్శకుడు అజయ్‌ భూపతినే. ‘మహా సముద్రం’ సినిమా షూటింగ్‌ సమయంలో సిద్ధార్థ్‌, అదితీ రావ్ హైదరీ మధ్య ప్రేమ చిగురించింది అని అంటారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలసి ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఇంచుమించు ఇదీ పాత విషయమే. అయితే అజయ్ భూపతి ఈ ఇద్దరి రిలేషన్ మీద ట్వీట్ చేశారు.

వాళ్లిద్దరి విషయంలో జరుగుతున్న విషయానికి నేనే కారణం అని అంతా అనుకుంటున్నారు. అసలేం జరుగుతోంది అంటూ సిద్దార్థ్, అదితీ క్లోజ్‌గా ఉన్న ఫోటోను షేర్ చేశారు అజయ్‌ భూపతి. దీంతో ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు బయటకు తీసింది అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కొందరైతే తన రాబోయే సినిమా ‘మంగళవారం’ గురించి ఈయన శనివారమే ప్రచారం షురూ చేశారు అని కామెంట్స్‌ చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఇటు సిద్ధార్థ్‌ కానీ, అదితీ కాని ఏమన్నా స్పందిస్తారేమో చూడాలి.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus