ప్రస్తుతం సినిమా రంగంలోనూ గ్లామర్ ప్రపంచంలో కాస్టింగ్ కౌ… చ్ అనేది ఒక పెను భూతంగా మారిపోయింది. చాలామంది హీరోయిన్లు, స్టార్ హీరోయిన్లు, బుల్లితెర నటీమణులు లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా దీనిని ఫేస్ చేయలేక సినిమాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఓపెన్ గా చెబుతున్నారు. గతంలో అంటే సోషల్ మీడియా లేదు.. అవకాశాల కోసం వేధింపులు ఎదుర్కొన్న వారి విషయాలు పెద్దగా బయటకు వచ్చేవే కావు. అయితే ఇప్పుడు నడుస్తోంది అంతా సోషల్ మీడియా యుగం కావడంతో ఎవరికివారు నిర్భయంగా..
ధైర్యంగా తాము ఎదుర్కొన్న అనుభవాలు, వేధింపులు గురించి చెబుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ అదితి రావు తన తాజా ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించారు. కాస్టింగ్ కౌచ్ మీద ప్రశ్నకు స్పందించిన ఈ బ్యూటీ ఈ విషయంలో ఎవరిని ? నిందించాల్సిన అవసరం లేదు.. అలాగే ఎవరిని ? తప్పు పట్టాల్సిన పనిలేదు దీనివల్ల పెద్దగా ప్రయోజనం కూడా ఉండదని చెప్పింది. ఏదేమైనా సరే అమ్మాయిల బలహీనత మీదనే అది డిపెండ్ అయ్యి ఉంటుంది.
ఇష్టపూర్వకంగా కమిట్మెంట్లు ఇచ్చాక మళ్ళీ దాని గురించి మాట్లాడటం.. కామెంట్లు చేయడం అనవసరం అని.. మనం బలహీనంగా ఉంటేనే ఎవరైనా ? అడ్వాంటేజ్ తీసుకుంటారని అందుకే ప్రతి ఒక్కరూ మనల్ని మనం స్ట్రాంగ్ గా ఉంచుకోవాలని చెప్పింది. ఇలాంటి వాటికి ఎవరు లొంగకూడదని అదితీరావు చెప్పుకొచ్చింది. అదితి (Aditi Rao Hydari) చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
అంటే ఒకసారి ఇష్టపూర్వకంగా కమిట్మెంట్ ఇచ్చాక మళ్లీ దానిపై కామెంట్ చేయడం అనవసరం అన్నట్టుగా అదితి చెప్పగానే చెప్పింది. ఇక అదితి ప్రస్తుతం సీనియర్ హీరో సిద్ధార్థ తో కలిసి డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుని ఒకటవ బోతున్నారని ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!