టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సిద్దార్థ్ (Siddharth) అదితీరావు హైదరీతో (Aditi Rao Hydari) ప్రేమలో ఉన్నట్టు గతంలో వార్తలు ప్రచారంలోకి రాగా కొన్ని నెలల క్రితం వనపర్తిలో సిద్దార్థ్ అదితి నిశ్చితార్థ వేడుక జరిగింది. అదితీరావు హైదరీ తాజాగా మరోసారి మాట్లాడుతూ ప్రేమ, పెళ్లి ముచ్చట్లను చెప్పుకొచ్చారు. మా నాన్నమ్మ అంటే నాకు ఎంతో ఇష్టమని నాన్నమ్మతో అన్ని విషయాలను షేర్ చేసుకునేదానినని ఆమె చెప్పుకొచ్చారు. నాన్నమ్మ హైదరాబాద్ లో ఒక స్కూల్ ప్రారంభించారని ఆ స్కూల్ ఎంతో ప్రత్యేకం అని ఆమె పేర్కొన్నారు.
నా చిన్ననాటి రోజులను అక్కడే ఎక్కువగా గడిపానని కొన్నేళ్ల క్రితం నాన్నమ్మ కన్ను మూశారని ఈ విషయం సిద్దార్థ్ కు సైతం తెలుసని అదితీరావు హైదరీ పేర్కొన్నారు. ఒకరోజు సిద్దార్థ్ నా దగ్గరకు వచ్చి ఆ స్కూల్ కు తీసుకెళ్లాలని కోరాడని ఆ స్కూల్ కు వెళ్లిన సమయంలో సిద్దార్థ్ మోకాళ్లపై నిలబడి నాకు ప్రపోజ్ చేశాడని ఆమె తెలిపారు. మార్చిలో సిద్దార్థ్ ప్రపోజ్ చేశాడని నాన్నమ్మ ఆశీస్సుల కోసమే అక్కడ ప్రపోజ్ చేశానని సిద్దార్థ్ చెప్పాడని ఆమె పేర్కొన్నారు.
సిద్దార్థ్ లవ్ ఎక్స్ ప్రెస్ చేసిన తీరు ఎంతగానో నచ్చిందని అదితీరావు హైదరీ కామెంట్లు చేశారు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురంలో ఉన్న రంగనాథస్వామి ఆలయం మా కుటుంబానికి స్పెషల్ అని మా నిశ్చితార్థం అక్కడే జరిగిందని పెళ్లి సైతం అక్కడే జరుగుతుందని పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యాక అధికారికంగా ఆ వివరాలను చెబుతామని ఆమె అన్నారు. మేము సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నామని చాలామంది మాట్లాడుకుంటున్నారని సీక్రెట్, ప్రైవేట్ అనే పదాలకు చాలా తేడా ఉందని అదితి తెలిపారు.
మా నిశ్చితార్థానికి ఎవరిని పిలవలేదో వాళ్లు మాత్రమే ఈ ఫంక్షన్ సీక్రెట్ ఫంక్షన్ అని భావిస్తున్నారని అదితి పేర్కొన్నారు. ఆ ఫంక్షన్ మా ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో జరిగిన ప్రైవేట్ ఫంక్షన్ అని ఆమె వెల్లడించారు. పెద్దల నిర్ణయం ప్రకారం పెళ్లి తేదీని నిర్ణయిస్తామని అదితి అన్నారు.