Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అడవి శేష్ లాంచ్ చేసిన ‘హసీన’ టీజర్ రిలీజ్

అడవి శేష్ లాంచ్ చేసిన ‘హసీన’ టీజర్ రిలీజ్

  • October 14, 2022 / 08:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అడవి శేష్ లాంచ్ చేసిన ‘హసీన’ టీజర్ రిలీజ్

ప్రియాంక డే టైటిల్ రోల్‌లో సాయి తేజ గంజి, థన్వీర్, శివ గంగా, ఆకాష్ లాల్, వశిష్ణ నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం హసీన . ఈ సినిమాను ఎస్ రాజశేఖర్ రెడ్డి, తన్వీర్ ఎండీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టెక్నికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి నవీన్ ఇరగాని దర్శకత్వం వహిస్తున్నారు. పింటు శుభం ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఒక నిమిషం 41 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్ ఆధ్యంతం ఆకట్టుకుంది. సగటు ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా ఈ టీజర్ కట్ చేశారు. స్నేహితులు చివరిదాకా వెంటే ఉంటారు కానీ అన్ని సమయాల్లో మాత్రం కాదు అనే కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమాను రూపొందించారు. ఎవడైనా బాగుపడాలన్నా సంకనాకి పోవాలన్నా దానికి కారణం ఫ్రెండ్స్ అయి ఉంటారు అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్.. యూత్ ఆడియన్స్ ని థ్రిల్ చేసే సన్నివేశాలతో ఆకట్టుకుంది. ఒక మనిషిని చంపాలంటే ఆయుధబలం అవసరం లేదు బుద్ధి బలం ఉంటే చాలు అనే డైలాగ్ ఈ మూవీ కథలో కొత్తదనాన్ని తెలుపుతోంది. ఇక చివరగా.. నా పేరు హసీనా.. నా కథ మీకు అర్థం కావాలంటే మీరు మందైనా తగి ఉండాలి లేక మేధావి అయినా అయి ఉండాలి అని చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తి పెంచేస్తోంది.

ఈ టీజర్ రిలీజ్ చేసిన అనంతరం అడవిశేష్ మాట్లాడుతూ.. హసీనా అనేది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని, 84 మంది కొత్త నటీనటులతో ఈ సినిమా రూపొందించడం విశేషమని చెప్పారు. టీజర్ చాలా బాగా వచ్చిందని అన్నారు.
ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

అంతకుముందు ఈ చిత్రం నుంచి రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన పాటను విడుదల చేశారు యంగ్ హీరో నిఖిల్. ఈ పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతూ అంచనాలు క్రియేట్ చేసింది. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్, మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.

ఈ సినిమాకు హరీష్ కృష్ణ (చంటి) ఎడిటర్‌గా, రామ కందా కెమెరామెన్‌గా, షారుక్ షేక్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. నేపథ్య సంగీతాన్ని నవనీత్ చారి అందిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి తేజ గంజి లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #HASEENA

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

9 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

12 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

14 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

15 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version