Adivi Sesh: ఆ సినిమాలో తీసుకున్నాం.. కానీ చూపించలేదు: శేష్‌

రెజీనా కసాండ్రా, నివేదా థామస్‌ కలసి త్వరలో ‘శాకినీ డాకినీ’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఆ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన అడివి శేష్‌.. ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన సునీతా తాటికి క్షమాపణలు చెప్పారు. అయితే దీనికి కారణం ఈ సినిమా కారణం కాదు. శేష్‌ నుండి ఇటీవల వచ్చిన ‘మేజర్‌’ సినిమా అట. ఆ సినిమాలో నిర్మాత సునీతతో ఓ పాత్ర చేయించినా.. సినిమాలో చూపించలేకపోయారట.

నిర్మాత సునీతకు సారీ చెప్పడం కోసమే ఈ ఈవెంట్‌కి వచ్చాను అంటూ అడివి శేష్‌ మొదలుపెట్టాడు. దీంతో శేష్‌ ఇలా ఎందుకు అంటున్నాడు అని అందరూ అనుకునర్నారు. అప్పుడు అసలు విషయం చెప్పాడు శేష్‌. మా ‘మేజర్‌’ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఓ ఆర్టిస్ట్‌ను ఎంపిక చేశాం. కానీ కొవిడ్‌ కారణంగా ఆమె రాలేకపోయారు. అప్పుడే మాకు సునీత గుర్తొచ్చారు. సినిమాలోని హీరోయిన్‌ తల్లిగా నటించాలని ఆమెను అడిగితే ఓకే అన్నారు. కానీ సినిమాలో చూపించలేకపోయాం అని చెప్పాడు శేష్‌.

సినిమా ఫైనల్‌ కట్‌ సమయంలో.. నిడివి సమస్య కారణంగా సునీత సన్నివేశాలను తొలగించాం. అప్పుడు కలసి సారీ చెబితే కొడతారేమోనన్న భయంతో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు శేష్‌. ఆ తర్వాత స్టేజీ మీద నివేదా థామస్‌, రెజీనాతో కలసి కాసేపు సరదాగా మాట్లాడాడు శేష్‌. మొన్నీ మధ్య రెజీనా వేసిన ‘మ్యాగీ.. మగాడు’ జోక్‌ గురించి అడిగి.. ఆమెకు కౌంటర్‌ వేశాడు. మా ఫ్రెండ్స్‌ అందరితో నటిస్తున్నావ్‌ నాతో ఎప్పుడు అంటూ నివేదాను అడిగాడు శేష్‌.

సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘శాకిని డాకిని’కి డి. సురేశ్‌బాబు, సునీత తాటి, హ్యూన్‌ వూ థామస్‌ కిమ్‌ నిర్మాతలు. ఈ సినిమా ఈ నెల 16 ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ అనే కొరియన్‌ సినిమాకు ఇది రీమేక్‌ అనే విషయం తెలిసిందే.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus