Adivi Sesh: దేవుడా.. అడివి శేష్ చేసిన ట్వీట్ లో అంత అర్థం ఉందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో అడివి శేష్ కూడా ఒకరనే సంగతి తెలిసిందే. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న అడివి శేష్ రెమ్యునరేషన్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. గతేడాది మేజర్, హిట్2 సినిమాలతో విజయాలను అందుకున్న అడివి శేష్ ప్రస్తుతం గూఢఛారి2 సినిమాపై ఫోకస్ పెట్టారని సమాచారం అందుతోంది. అడివి శేష్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే అడివి శేష్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి వేర్వేరు వార్తలు వినిపిస్తున్నా ఆ వార్తల్లో నిజానిజాలకు సంబంధించి స్పష్టత రావాల్సిఉంది.

అడివి శేష్ సోషల్ మీడియాలో “వచ్చిన దారినే చూసుకోకపోతే.. ముందున్న దారిని ఎలా సరిదిద్దుకుంటాం” అని పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్ కు సంబంధించి ఏదో బలమైన అర్థం ఉందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో గతాన్ని మరిచిపోయి ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటే వాళ్లకు బుద్ధి చెప్పాలని అడివి శేష్ ఈ కామెంట్ చేసి ఉండవచ్చని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అడివి శేష్ (Adivi Sesh) రాబోయే రోజుల్లో ఈ ట్వీట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో స్పందించి స్పష్టత ఇస్తారేమో చూడాల్సి ఉంది. మరోవైపు ఈ ట్వీట్ గురించి పలువురు సెలబ్రిటీలు తమదైన శైలిలో స్పందించడం గమనార్హం. రాహుల్ రవీంద్రన్ ఈ ట్వీట్ గురించి స్పందిస్తూ ” శేష్ ఏం చెబుతున్నాడు వెన్నెల కిషోర్ ఏదో సీక్రెట్ గా చెబుతున్నాడు.. కొంపదీసి మన గురించేనా” అని కామెంట్ చేయగా వెన్నెల కిషోర్ “అవి ట్రాఫిక్ కోట్స్.. వదిలేసి వేరేవి చూసుకో” అని చెప్పుకొచ్చారు.

ఈ కామెంట్ల గురించి చిన్మయి స్పందించి ఎమోజీలతో రియాక్షన్ ఇచ్చారు. అడివి శేష్ మినిమం గ్యారంటీ హీరోగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. సినిమాసినిమాకు అడివి శేష్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం అడివి శేష్ సినిమాలను నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus