జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం ‘వార్ 2’ లో (War 2) నటిస్తున్నాడు. అటు తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘డ్రాగన్’ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్..లు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ‘సప్త సాగరాలు దాటి’ (Sapta Sagaralu Dhaati) ఫేమ్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ఎంపికైంది. అయితే కథ ప్రకారం ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందట.
అలా అని ఇది ఐటెం సాంగ్ కాదు. సినిమాలో అత్యంత కీలకమైన సమయంలో వచ్చే పాట. అందుకే ఈ పాట కోసం రెగ్యులర్ ఐటెం భామలను కాకుండా ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ క్రమంలో శృతి హాసన్..ను సంప్రదించినట్లు సమాచారం. మొన్నామధ్య సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన శృతి హాసన్ (Shruti Haasan) .. మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తుంది.
‘వకీల్ సాబ్'(Vakeel Saab) ‘సలార్’ (Salaar) వంటి హిట్ సినిమాల్లో నటించింది. ‘సలార్’ కి దర్శకుడు ప్రశాంత్ నీల్ అనే సంగతి తెలిసిందే. దానికి సెకండ్ పార్ట్ కూడా ఉంది. అందులో కూడా శృతి హాసన్ నటించనుంది. అందుకే ‘డ్రాగన్’ లో కూడా ఆమెను ఓ స్పెషల్ సాంగ్ కోసం ప్రశాంత్ నీల్ తీసుకున్నట్లు స్పష్టమవుతుంది.
ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా రూపొందిన ‘రామయ్య వస్తావయ్యా’ (Ramayya Vasthavayya) సినిమాలో శృతి హాసన్ ఓ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.2013 లో ఆ సినిమా రిలీజ్ అయ్యింది. 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆమె ఎన్టీఆర్ సినిమాలో కనిపించనుంది.