బోయపాటి – దిల్ రాజు కాంబినేషన్లో సినిమా.. ఫ్యాన్స్ కు పండగే..!

టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎవరు అనగానే అందరూ టక్కున చెప్పే పేరు దిల్ రాజు..! ఓ పక్క చిన్న సినిమాలు చేస్తూనే.. మరో పక్క మీడియం రేంజ్ హీరోలతో మీడియం బడ్జెట్ సినిమాలు, మరోపక్క స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు.. చేస్తుంటారు. ప్రతీ సంవత్సరం దిల్ రాజుగారి లైనప్ ఇలా ఉంటుంది. ఆయన 17 ఏళ్ళ కెరీర్లో ఎంతో మంది కొత్త డైరెక్టర్లను పరిచయం చేశారు. వారిలో చాలా మంది స్టార్ డైరెక్టర్లుగా ఎదిగారు కూడా..!

వారిలో సుకుమార్,బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి వంటి వారున్నారు. ఇది పక్కన పెడితే.. 15 ఏళ్ళ తరువాత దిల్ రాజు… మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో పనిచెయ్యబోతున్నారట. 2005 లో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘భద్ర’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆ చిత్రాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు టీవీల్లో ఎగబడి చూస్తుంటారు. అయితే ‘భద్ర’ తరువాత ఎందుకో బోయపాటి శ్రీను- దిల్ రాజు కాంబినేషన్లో సినిమా రాలేదు. అనేక సార్లు సినిమా చెయ్యాలని వీరిద్దరూ అనుకున్నారట.

కానీ స్క్రిప్ట్ వర్కౌట్ కాలేదని తెలుస్తుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను.. బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తయ్యాక దిల్ రాజు నిర్మాణంలో బోయపాటి శ్రీను సినిమా ఉంటుందని తాజా సమాచారం. అయితే హీరో ఎవరు అనే విషయం తెలియాల్సి ఉంది.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus