Sravana Bhargavi: వివాదాలు శ్రావణ భార్గవికి అలా కలిసొచ్చాయా?

శ్రావణ భార్గవి అందరికీ సుపరిచితమే. బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ‘సింహా’ లో ‘సింహమంటి చిన్నోడే’ అనే పాట పాడి తన సినీ కెరీర్ ను మొదలుపెట్టింది. అటు తర్వాత ‘ఖలేజా’ ‘బద్రీనాథ్’ ‘కందిరీగ’ ‘రాజన్న’ ‘దమ్ము’ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ‘రెబల్’ ‘ఎం.సి.ఎ’ వంటి చిత్రాల్లో పాటలు పాడింది. శ్రావణ భార్గవి చివరిగా 2018 లో వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో ఓ పాట పాడింది. ఆ తర్వాత ఈమె పాటలు పాడింది లేదు.

‘గబ్బర్ సింగ్’ లో శృతిహాసన్ కు, ‘ఈగ’ లో సమంత కి డబ్బింగ్ చెప్పింది ఈ బ్యూటీ.సినిమాల్లో పాటలు పాడకపోయినా ఈ మధ్య కాలంలో శ్రావణ భార్గవి ఎక్కువగా వార్తల్లో నిలిచింది. తన భర్త హేమచంద్ర తో విడాకులు తీసుకుందంటూ కొన్ని రోజులు వార్తల్లో నిలిస్తే.. అన్నమయ్య రాసిన ‘ఒకపరికొకపరి వయ్యారమై…’ కీర్తనను శృంగారభరితంగా మార్చిందంటూ అన్నమయ్య కుటుంబ సభ్యులు ఈమె పై మండిపడ్డారు. అంతేకాదు శ్రావణ భార్గవి ని తిరుపతిలో అడుగుపెట్టనివ్వం అంటూ టీటీడీ సభ్యులు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ ఇష్యూలో ఆమె పై పోలీస్ కేసు ఫైల్ అవ్వడం కూడా జరిగింది. ఈ వార్తలతో మునుపటికంటే కూడా శ్రావణ భార్గవికి క్రేజ్ పెరిగింది అని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా.. 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ శ్రావణ భార్గవి ఓ సినిమాలో పాట పాడింది. అది ‘లైగర్’ వంటి క్రేజీ సినిమాలో.

విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీలో ‘ఆఫత్’ అనే పాటను ఈమె పాడింది. యూట్యూబ్ లో ఆ పాట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ‘లైగర్’ మూవీ ఆగస్టు 25న విడుదల కాబోతుంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus