విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) – రష్మిక (Rashmika Mandanna) .. ఈ కాంబోకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నారు అనేది చాలా మందికి తెలిసిన వార్తే.అధికారికంగా వీళ్ళు ప్రకటించింది లేదు.కానీ ఎప్పటికప్పుడు హింట్ ఇస్తూనే ఉన్నారు. ‘గీత గోవిందం’ (Geetha Govindam) సినిమాతో వీరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వీరికి హిట్ పెయిర్ అనే ట్యాగ్ వచ్చి పడింది. మరోపక్క విజయ్ తో రష్మిక క్లోజ్ అవ్వడం వల్ల..
ఆమె తన ‘ప్రియుడు రక్షిత్ శెట్టికి (Rakshit Shetty) దూరమైంది.. అందుకే ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయ్యింది’ అనే చర్చ కూడా నడిచింది. ఆ తర్వాత అందులో నిజం లేదని వీళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. తర్వాత ‘డియర్ కామ్రేడ్’ లో(Dear Comrade) కూడా వీళ్ళు కలిసి నటించారు. ఇదిలా ఉంటే.. తర్వాత ఈ జంట ఒకటి, రెండు యాడ్స్ లో కలిసి నటించారు. సోషల్ మీడియాలో ఈ జంటకు ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి. వీళ్ళ కాంబినేషన్లో మరో సినిమా వస్తే చూడాలని ఆశపడుతున్నట్టు…
ఈ జంట ఎప్పటికప్పుడు కామెంట్లు పెడుతూనే ఉన్నారు.వారి కోరిక ప్రకారం… ఫైనల్ గా ఈ కాంబో మరోసారి సెట్ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. విషయంలోకి వెళితే… మైత్రి మూవీ మేకర్స్ లో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయబోతున్నాడు. ‘టాక్సీవాలా’ (Taxiwaala) దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ( Rahul Sankrityan) దీనికి దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికని ఫైనల్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.