‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తరువాత వరుసగా టాలీవుడ్లో మల్టీ స్టారర్ సినిమాలు రూపొందుతున్నాయి. కానీ అవి సమ ఉజ్జీలు చెయ్యడం లేదు అనేది కొందరు ప్రేక్షకుల అభిప్రాయం. ఇప్పుడంటే రాజమౌళి.. పుణ్యమా అని చరణ్ – ఎన్టీఆర్ ల కాంబినేషన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ రాబోతుంది. అయితే ప్రేక్షకుల దృష్టాంతా పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు ల మల్టీ స్టారర్ ఎప్పుడు వస్తుందా అనే దాని పైనే ఉంది. ఈ కాంబో గురించి గాసిప్పులు వస్తున్నాయి తప్ప.. సినిమా రావడం లేదు. ‘వి’ అనే చిత్రాన్ని ఇంద్రగంటి.. పవన్ – మహేష్ లతో చేద్దామనుకున్నాను అని సరదాగా అన్నాడు.
అది కాస్త ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కాంబోకి గల క్రేజ్ అలాంటిది మరి. అయితే ‘వి’ సినిమా చూసిన తరువాత .. పవన్, మహేష్ లు చాలా లక్కీ అనే కామెంట్లు కూడా వినిపించాయి. అయితే పవన్ -మహేష్ లు మరింత లక్కీ అని మీరు ఒప్పుకునేలా మరో న్యూస్ చెబుతా..! నిజానికి పవన్, మహేష్ లను పెట్టి ఓ సినిమా చెయ్యాలని 8 ఏళ్ళ క్రితమే ఓ దర్శకుడు ప్లాన్ చేసాడట. ఆ దర్శకుడు మరెవరో కాదు మన మెహర్ రమేష్. ‘బిల్లా’ టైంలోనే మెహర్ ఆ దిశగా ప్రయత్నాలు చేసాడు.
జేమ్స్ బాండ్ తరహా కథ అది. పవన్, మహేష్ లకు మెహర్ చాలా క్లోజ్. పవన్ కు మెహర్ వరసకి తమ్ముడవుతాడు. ఇక మహేష్ కు మెహర్ బెస్ట్ ఫ్రెండ్.ఇప్పటికీ మహేష్ బిజినెస్ వ్యవహారాలు మెహరే చక్కపెడుతుంటాడు. అందుకే మెహర్ చెప్పిన లైన్ ఈ ఇద్దరు స్టార్లు విని పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. కానీ ‘శక్తి’ ‘షాడో’ ల రిజల్ట్ .. మెహర్ రమేష్ ను అడ్డుకుంది. లేకుంటే ఈ ప్రాజెక్టు అప్పుడే పట్టాలెక్కేది.