కోవిడ్ ఫస్ట్ వేవ్ అలాగే సెకండ్ వేవ్ ల తర్వాత థియేటర్లు కళకళలాడాయి అంటే అది మన తెలుగు రాష్ట్రాల్లోనే అని చెప్పాలి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ ఏడాది అనగా.. ఈ 2021 లో 10 హిట్లు కొట్టింది టాలీవుడ్ మాత్రమే. ఓవర్సీస్ లో కూడా రూ.1 మిలియన్ వసూళ్లను రాబట్టినవి మన తెలుగు సినిమాలే కావడం మరో విశేషం. తమిళ, కన్నడ, మలయాళం ఇలా అన్ని సినీ పరిశ్రమలోనూ థియేటర్లు తెరుచుకున్నా…
కొత్త సినిమాలు రిలీజ్ అయినా జనాలను రప్పించడంలో సక్సెస్ అవ్వలేదు. బాలీవుడ్లో కూడా ఈ మధ్యనే థియేటర్లు తెరుచుకున్నాయి. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘బెల్ బాటమ్’ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి సూపర్ హిట్ టాకే వచ్చింది. కానీ కలెక్షన్లు మాత్రం చాలా ఘోరంగా నమోదు అయ్యాయి.మొదటి రోజు 2.65 కోట్లు, రెండో రోజు రూ.2.7 కోట్లు, మూడో రోజు 3.1 కోట్లు, నాలుగవ రోజు రూ.4.5 కోట్ల నెట్ కలెక్షన్స్ ని రాబట్టింది ఈ చిత్రం.
అంటే నాలుగు రోజులు కలుపుకుని రూ.12.95 కోట్ల నెట్ కలెక్షనను మాత్రమే రాబట్టింది ఈ చిత్రం. ‘బెల్ బాటమ్’ కు రూ.30 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అయితే 4 రోజులకి సగం కూడా రికవర్ కాలేదు. మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.15 కోట్లు అనుకున్నా. మరో రూ.15 కోట్లు బయ్యర్లకు నష్టం అన్న మాట. 2012 లో వచ్చిన ‘జోకర్’ తర్వాత అక్షయ్ ఫేస్ చేసిన డిజాస్టర్ ఇదే కావడం గమనార్హం.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!