Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కొత్త కారు చూశారా?

రాహుల్ సిప్లిగంజ్… ఈ పేరుకి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో చార్ట్ బస్టర్ సాంగ్స్ పాడాడు. కానీ అప్పటికి ఇతని మొహం చాలా మందికి తెలీదు. మధ్యలో మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేశాడు. అందులో కూడా తన సత్తా చాటాడు. కానీ జనాలకు ఇతని మొహం తెలిసింది మాత్రం బిగ్ బాస్3 సీజన్ తోనే..! ఆ సీజన్ కు విన్నర్ గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు రాహుల్ సిప్లిగంజ్.

నిజానికి విన్నర్ అయ్యేంతలా కూడా ఇతను చేసింది లేదు. ఆ విషయం రాహుల్ కు కూడా తెలుసు. శ్రీముఖి ఇతనితో గొడవలు పడి .. ఇతన్ని టార్గెట్ చేయడం మరో పక్క పునర్నవితో రొమాన్స్.. ఈ రెండు విషయాల కారణంగా బిగ్ బాస్ లో అతను బాగా హైలెట్ అయ్యాడు. ఆ అదృష్టం కలిసొచ్చే ఇతను విన్నర్ గా నిలిచాడు. ఇక హౌస్ లో ఉన్నన్ని రోజులు సొంత ఇల్లు తన కల అని చెబుతూ వచ్చాడు రాహుల్.

తాను అనుకున్నట్టుగానే ఇటీవల సొంత ఇంటి నిర్మాణం పనులు పూర్తి చేసుకుని .. ఆ ఇంట్లోకి అడుగు పెట్టేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక ఇప్పుడు ఏకంగా రూ.60 లక్షల విలువ గల కారు కొని అందరినీ ఆశ్చర్యపరిచాడు.తన పుట్టిన రోజు నాడు(ఆగస్టు 22న) కొత్త కారు కొని దానితో దిగిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన రాహుల్… “నా తల్లిదండ్రులకు , నా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు !

ప్రత్యేకంగా నా సోదరుడికి కృతఙ్ఞతలు ..నన్ను ఇష్టపడే వాళ్ళందరి నుంచి నా పుట్టినరోజు నాడు ఇలాంటి అద్భుతమైన గిఫ్ట్ అందుకున్నాను” అంటూ రాహుల్ చెప్పుకొచ్చాడు. ఆ కారు ఫోటోలు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి:

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus