హీరోలకు ఏ సినిమా స్టార్ డం ను తెచ్చిపెడుతుందో కచ్చితంగా చెప్పలేము. వాళ్ళ టైం బాగుంటే.. కరెక్ట్ సినిమా పడితే…. అది వారి స్థాయిని ఎక్కడికో తీసుకెళ్తుంది. అంతేకాదు ఆ హీరోకి అప్పటి వరకూ ఉన్న మార్కెట్ ను 10రెట్లు పెంచేస్తుంది. మన యష్ సంగతి కూడా అంతే..! కన్నడ సినిమాలకు ఇక్కడ ఆదరణ చాలా తక్కువ. ఎందుకంటే.. వాళ్ళ సినిమాలు దాదాపు రీమేక్ లే ఉంటాయి కాబట్టి. అయితే ‘కె.జి.ఎఫ్’ చిత్రం ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసింది.
సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఆ చిత్రం ఘన విజయం సాధించింది. హీరో యష్ మార్కెట్ ను 10రెట్లు పెంచింది. ఇప్పుడు రాబోతున్న ‘కె.జి.ఎఫ్2’ చిత్రం కనుక సూపర్ హిట్ అయితే అతని మార్కెట్ మరింతగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. అయితే ‘కె.జి.ఎఫ్2’ తరువాత యష్.. తన పాన్ ఇండియా మార్కెట్ ను నిలుపుగోగలడా అన్నది ఇప్పుడున్న పెద్ద ప్రశ్న. అలా నిలుపుకోవాలి అంటే పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేస్తే సరిపోదు. డిఫరెంట్ కథలు..
అది కూడా ఆడియెన్స్ ను రిసీవ్ చేసుకునేలా ఎంచుకోవాలి. కేవలం కన్నడ ప్రేక్షకులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని కథలు ఎంచుకుంటే సరిపోదు. ప్రస్తుతం యష్.. శంకర్ డైరెక్షన్లో సినిమా చేస్తాడంటూ ప్రచారం జరుగుతుంది. మరోపక్క పూరి జగన్నాథ్ తో కూడా సినిమా చేసే అవకాశం ఉందంటున్నారు. మరి అతను తన నెక్స్ట్ ప్రాజెక్టుకి ఏ దర్శకుడిని సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి.