అజయ్ భూపతి డైరెక్షన్లో నాగ చైతన్య చిత్రం..!

రెండేళ్ళ తరువాత ‘మజిలీ’ చిత్రంతో ఓ మంచి హిట్టందుకున్నాడు నాగ చైతన్య. శివ నిర్వాణ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం చైతూ కెరియర్లోనే అత్యధిక కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతుంది. ఈ చిత్రంలో చైసామ్ ల నటనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం ఇప్పటికీ మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఇదే జోష్ లో తన తరువాతి చిత్రాల పై దృష్టి పెడుతున్నాడు చైతన్య. ఈ నేపథ్యంలో ‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్లో నటించడానికి రెడీ అవుతున్నాడని తాజా సమాచారం.

‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అజయ్ భూపతి. ఇప్పుడు ఈ కుర్ర డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి యువ హీరోలు ఎగబడుతున్నారు.ఈ క్రమంలోనే రామ్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు అజయ్. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు సెట్ కాలేదు. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ తో వైపుకు మళ్ళాడు. అయితే సాయి శ్రీనివాస్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో అన్నపూర్ణ కాంపౌండ్ లో అడుగుపెట్టాడట. లవ్ అండ్ యాక్షన్ నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ సెట్టవుతుందో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus