నిన్న ప్రభాస్ ‘ఛత్రపతి’, నేడు ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’!

గత కొంతకాలంగా సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. ఇక్కడి సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేస్తూ లాభాలు పొందుతున్నారు నిర్మాతలు. తెలుగు సినిమాలు ‘రెడీ’, ‘పోకిరి’, ‘కిక్’ వంటి చిత్రాలను బాలీవుడ్ లో రీమేక్ చేశారు. సల్మాన్ లాంటి స్టార్ హీరోలు ఈ సినిమాల్లో నటించారు. రీసెంట్ గా ‘అర్జున్ రెడ్డి’ సినిమాను కూడా రీమేక్ చేశారు. త్వరలోనే నాని ‘జెర్సీ’ని రీమేక్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ బ్లాక్ బస్టర్ సినిమా ‘ఛత్రపతి’ని హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

బెల్లంకొండ శ్రీనివాస్ ఈ రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ప్లాప్ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఊసరవెల్లి’ సినిమా విడుదలై దాదాపు పదేళ్లు కావొస్తుంది. పైగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాని బాలీవుడ్ లో తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. నిర్మాత ఎస్ తౌరానీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధం చేయిస్తున్నారట. హిందీలో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేసి వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్-తమన్నా జంటగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నారు. మరి తెలుగులో డిజాస్టర్ అయిన ఈ సినిమాకి హిందీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus