సగటు ప్రజలకు వచ్చే సమస్య… సెలబ్రిటీలకు వస్తే అది పెద్ద సమస్య అవుతుంది అంటారు. దీనికి తాజా ఉదాహరణ రష్మిక మందన డీప్‌ఫేక్ ఫొటో. గత కొన్నేళ్లుగా డీప్‌ఫేక్ టెక్నాలజీతో ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఒకప్పుడు ఫొటో మార్ఫింగ్, వీడియో మార్ఫింగ్ చేసేవారు. అయితే ఆ సమయంలో చేసినవాళ్లు దొరికిపోయేవారు. అయితే ఇప్పుడు డీప్ ఫేక్ టెక్నాలజీ వచ్చాక గుర్తుపట్టడం అంత ఈజీగా లేదు. అలా ఇటీవల నెటిజన్లు, ఫ్యాన్స్ రష్మిక మందన వీడియో చూసి నిజం అనుకున్నారు.
ఇప్పుడు ఇదే కోవలో కట్రినా కైఫ్ (Katrina Kaif) ఫొటో ఒకటి వచ్చింది. రష్మిక డీప్‌ఫేక్ వీడియోపై ఓవైపు సెలబ్రిటీలు, సగటు జనాలతోపాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ తరహా వీడియోల అడ్డుకునేందుకు కేంద్రం కూడా నడుం బిగించింది. ఇలాంటి వీడియోల వ్యాప్తిని అడ్డుకోవాల్సిన బాధ్యత సోషల్ మీడియాకు కూడా ఉందని కేంద్రం గుర్తు చేసింది. ఈ మేరకు అడ్వైజరీని కూడా జారీ చేసింది. ఈలోపు కట్రినా కైఫ్ మార్ఫింగ్ ఫొటో బయటికొచ్చింది.
‘టైగర్ 3’ సినిమాలో కట్రినా టవల్‌తో ఓ యాక్షన్ సీన్‌లో నటించింది. దానికి సంబంధించిన ఫొటోను ఇటీవల విడుదల చేశారు. ఇప్పుడు ఆ ఫొటోనే డీప్‌ఫేక్ ద్వారా ఆశ్లీలంగా చిత్రీకరించారు. దీంతో మరోసారి డీప్ ఫేక్ టెక్నాలజీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పరిస్థితి చూస్తుంటే ఇలాంటి వాటిని అరికట్టడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వర్క్ చేయాల్సి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
నిజానికి డీప్ ఫేక్ టెక్నాలజీ వచ్చిన తొలి రోజుల్లోనే దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ సాంకేతిక రెండువైపులా వాడి ఉన్న కత్తి లాంటిదని… జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయితే దీని వల్ల వచ్చే మంచి కంటే… చెడే ఎక్కువగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!