Vishal,Sai Dhanshika: 12 ఏళ్ళ ఏజ్ గ్యాప్.. సాయి ధన్సిక గురించి ఈ విషయాలు తెలుసా?

విశాల్  (Vishal ) – సాయి ధన్సిక  (Sai Dhanshika)  పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 29న వీరి పెళ్లి వేడుక జరగబోతున్నట్టు కూడా ప్రకటించారు. విశాల్ తమిళంలో స్టార్ హీరో. మొదటి నుండి కంటెంట్ ఉన్న యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చాడు. అతని తండ్రి జి.కె.రెడ్డి పెద్ద నిర్మాత అనే సంగతి అందరికీ తెలిసిందే. విశాల్ పెళ్లి గురించి ఏళ్ళ తరబడి చర్చ నడుస్తూనే ఉంది. మొదట్లో ఇతను హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar)  ని పెళ్లి చేసుకుంటాడని అంతా అనుకున్నారు.

Vishal,Sai Dhanshika:

అప్పట్లో వీళ్ళ మధ్య ప్రేమాయణం కూడా నడిచింది. కానీ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల బ్రేకప్ చెప్పేసుకున్నారు. అటు తర్వాత ఇతను నటి అనీషా రెడ్డిని  (Anisha Alla)  వివాహం చేసుకుంటాడని ప్రకటన వచ్చింది. వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల వీళ్ళు పెళ్లిపీటలు ఎక్కలేదు. తర్వాత అభినయతో (Abhinaya) విశాల్ పెళ్లి ఉంటుందని అన్నారు. కానీ ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని షాకిచ్చింది. మొత్తానికి విశాల్ హీరోయిన్ సాయి ధన్సికని పెళ్లి చేసుకోవడానికి అయితే రెడీ అయ్యాడు.

గతేడాది తాను ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఆమె సాయి ధన్సిక అని ఇన్నాళ్టికి బయటపడింది. అయితే చాలా మందికి సాయి ధన్సిక గురించి పూర్తి వివరాలు తెలియవు. రజనీకాంత్ (Rajinikanth)  ‘కబాలి’ సినిమాలో కూతురు పాత్ర చేసింది. అక్కడి వరకు మాత్రమే ఈమెను గుర్తిస్తారు. కానీ తమిళ హీరోల్లో విశాల్ కు ఎలా యాక్షన్ ఇమేజ్ ఉందో.. హీరోయిన్లలో సాయి ధన్సికకి కూడా యాక్షన్ ఇమేజ్ ఉంది.

తెలుగులో సాయి ధన్సిక స్ట్రైట్ సినిమాలు చేసింది. ‘షికారు'(Shikaaru) ‘అంతిమ తీర్పు’ ‘దక్షిణ’ వంటి సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించింది. ఇక సాయి ధన్సిక ఏజ్ ఇప్పుడు 35 ఏళ్ళు మాత్రమే. విశాల్ వయసు 47 ఏళ్ళు. వీళ్లిద్దరి మధ్య 12 ఏళ్ళు ఏజ్ గ్యాప్ ఉందని సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. కానీ కొంతమంది ఇది పెద్ద ఏజ్ గ్యాప్ కాదు అని కూడా అంటున్నారు.

షూటింగ్లో గాయపడ్డ రాశీ ఖన్నా..ఫోటోలు వైరల్ !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus