Agent: ఆ విషయంలో బాలయ్యను బీట్ చేసిన అఖిల్!

  • April 21, 2023 / 06:22 PM IST

అఖిల్ అక్కినేని తాజాగా ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చిన సమయం నుంచి ఇప్పటివరకు పలు సినిమాలలో నటించిన ఈయనకు సరైన హిట్ ఏది పడలేదని చెప్పాలి. ఈ క్రమంలోనే అఖిల్ తన ఆశలన్నీ కూడా ఏజెంట్ సినిమా పైన పెట్టుకున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

అఖిల్ ఈ సినిమా కోసం ఏ స్థాయిలో అయితే కష్టపడ్డారు ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా అదే స్థాయిలో కష్టపడుతూ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళుతున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వచ్చింది. ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటలలో యూట్యూబ్ లో 12మిలియన్ వ్యూస్ కైవసం చేసుకుంది.

అయితే ఈ ట్రైలర్ బాలకృష్ణ వీరసింహారెడ్డి ట్రైలర్ ను బీట్ చేయడం విశేషం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైనటువంటి ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి ట్రైలర్ 24 గంటల వ్యవధిలోనే 10 మిలియన్ వ్యూస్ కైవసం చేసుకుంది.

ఇలా ఈ సినిమా రికార్డును అఖిల్ అక్కినేని ఏజెంట్ (Agent) ట్రైలర్ బీట్ చేయడం విశేషం.ఇలా ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతూ ఈ సినిమాపై భారీ అంచనాలనే పెంచేసాయి.మరి ఏజెంట్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖిల్ ఈ సినిమా ద్వారా తన అంచనాలను చేరుకోబోతున్నారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus