ఆకట్టుకొంటున్న ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ట్రైలర్

  • June 7, 2019 / 06:36 PM IST

నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. స్వరూప్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. “మళ్ళీ రావా” ఫేమ్ రాహుల్ యాదవ్ నక్క ఈ చిత్రానికి నిర్మాత. రాబిన్ మార్క్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇవాళ ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్.

కనిపెట్టడానికి ఏ కేసులు లేక ఖాళీగా ఉండే డిటెక్టివ్ పాత్రలో హీరో నవీన్ కనిపిస్తున్నాడు. చిన్నా చితకా కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ గడుపుతున్న హీరోకి ఓ మర్డర్ మిస్టరీ ని ఛేదించే అవకాశం లభిస్తుంది. ఇక ఆ మర్డర్ మిస్టరీని హీరో ఎలా కనిపెట్టాడు. చివరికి ఏం జరిగింది అనేది ఈ చిత్ర కథాంశం. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘చంటబ్బాయ్’, మోహన్ బాబు ‘ డిటెక్టివ్ నారదా’ చిత్రాల ఛాయలు ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. నవీన్ పెర్ఫార్మన్స్ ఈ ట్రైలర్ కి హైలెట్ అని చెప్పొచ్చు. ‘షెర్లాక్ హోమ్స్’ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్ రా.. కానీ ఈ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఒరిజినల్ అంటూ హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. మొత్తానికి ట్రైలర్ సినిమా మీద మంచి అంచనాలు నమోదయ్యేలా చేసింది. సాధారణంగా ఈ జోనర్ సినిమాలు నిన్నమొన్నటివరకు బాలీవుడ్ లో మాత్రమే చూసాం.. ఇప్పుడు టాలీవుడ్ లోను “ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ”తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ చిత్రానికి కథానాయకుడు నవీన్ పోలిశెట్టి స్క్రీన్ ప్లే అందించడం విశేషం. జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వనున్న ఈ చిత్రం ద్వారా చాలా మంది కొత్త టీమ్ ఇండస్ట్రీకి పరిచయమవ్వనున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకొంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus