Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ప్రీ రిలీజ్‌

`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ప్రీ రిలీజ్‌

  • June 19, 2019 / 05:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ప్రీ రిలీజ్‌

న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాల‌ను పూర్తి చేసుకుని యు/ఏ స‌ర్టిఫికేట్‌ను తెచ్చింది. స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె ద‌ర్శకుడు. రాహుల్ యాద‌వ్ న‌క్కా నిర్మాత‌. ఈ చిత్రాన్ని జూన్ 21న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయి తేజ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. బిగ్ టికెట్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా…

agent-srinivasa-athreya-movie-pre-release-event

సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ – “నేను ఎ.ఐ.బిలో న‌వీన్ వీడియోస్‌ను చాలానే చూశాను. అత‌న్ని రెగ్యుల‌ర్‌గా ఫాలో అయ్యేవాడిని. త‌ను మంచి యాక్ట‌ర్‌. ఇప్పుడు త‌న సినిమా రంగంలోకి రావ‌డం ఆనందంగా ఉంది. ఓ మంచి సినిమాతో మ‌న ముందుకు రాబోతున్నాడు. పోస్ట‌ర్స్‌ను చూసి చాలా ఇన్‌స్ఫైర్ అయ్యాను. నాకు చాలా ఇష్ట‌మైన సినిమా చంట‌బ్బాయ్‌. అదే జోన‌ర్‌లో ఈ సినిమాను చేయ‌డం ఆనందంగా ఉంది. జూన్ 21న విడుద‌ల‌కానున్న ఈసినిమా కోసం ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నాను. న‌వీన్‌, హీరో స్వ‌రూప్‌, నిర్మాత రాహుల్‌గారికి అభినంద‌న‌లు. టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.

  • గేమ్ ఓవర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • వజ్ర కవచధర గోవింద సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

agent-srinivasa-athreya-movie-pre-release-event1

న‌వీన్ పొలిశెట్టి మాట్లాడుతూ – “మేం ట్రైల‌ర్ విడుద‌ల చేసిన‌ప్పుడు మాకు ట్విట్ట‌ర్ ద్వారా ఏ సెల‌బ్రిటీ స‌పోర్ట్ చేస్తారా? అని ఎదురుచూస్తున్న త‌రుణంలో సాయితేజ్ మా ట్రైల‌ర్‌ను షేర్ చేయ‌డం ద్వారా ఎంతో హెల్ప్ చేశాడు. త‌న‌కు ఈ సంద‌ర్భంగా థాంక్స్ చెబుతున్నాను. అలాగే డైరెక్ట‌ర్ స్వ‌రూప్‌కి స్పెష‌ల్ థాంక్స్‌. ఆయ‌న క‌థ‌ను సిద్ధం చేసుకున్న త‌ర్వాత ఎంద‌రో హీరోలు ముంద‌కు వ‌చ్చినా, నాతోనే సినిమా చేయాల‌ని వెయిట్ చేశారు. మా అంద‌రినీ 720 పిక్స‌ల్ వీడియో నుండి 70 ఎం.ఎం స్క్రీన్ వ‌ర‌కు తీసుకు వ‌చ్చిన అంద‌రికీ థాంక్స్‌. సినిమా హీరో కావాల‌నేది నా డ్రీమ్‌. ఆ క‌ల నేర‌వేరింది. రెండున్న‌రేళ్ల క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా ఇది. 21న ఈ సినిమా విడుద‌ల కానుంది. మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దించాల‌ని.. హిలేరియ‌స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని చెప్ప‌గ‌ల‌ను“ అన్నారు.

agent-srinivasa-athreya-movie-pre-release-event2

డైరెక్ట‌ర్ స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె మాట్లాడుతూ – “డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి స్క్రిప్ట్ రాసే క్ర‌మంలో నాకు చాలా టిప్స్ చెబుతూ వ‌చ్చాడు. టీజ‌ర్ రిలీజ్ అయిన త‌ర్వాత థ్రిల్ల‌ర్ మూవీకి ఓ సెక్ష‌న్ ఆఫ్ ఆడియ‌న్స్ మాత్ర‌మే ఉంటార‌ని కొంద‌రు స్నేహితులు చెప్పారు. ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది. కుటుంబ క‌థా థ్రిల్ల‌ర్ చిత్రం. మ‌రికొంద‌రు చంటబ్బాయ్ సినిమాలాగే ఉంద‌ని కూడా అన్నారు. అయితే చంట‌బ్బాయ్ అనేది ఓ క్లాసిక్‌. దాన్ని ఎవ‌రూ ముట్టుకోకూడ‌దు. కాబ‌ట్టి, మేం చంట‌బ్బాయ్ సినిమా చేయ‌లేదు. చిరంజీవిగారి, జంధ్యాల‌గారి టైమింగ్ మేం 1 శాతం కూడా మ్యాచ్ చేయ‌లేం. రాహుల్ నిర్మాత‌గా కంటే మంచి స్నేహితుడిగా నాకు స‌పోర్ట్ ఇచ్చారు. దాదాపు అంద‌రూ కొత్త‌వాళ్ల‌తో చేసిన చిత్ర‌మిది. 21న సినిమా చూసే ప్రేక్ష‌కుల‌కు, మంచి సినిమా చూశామ‌నే ఫీలింగ్‌తో బ‌య‌ట‌కు వెళ‌తార‌ని చెప్ప‌గ‌ల‌ను“ అన్నారు.

agent-srinivasa-athreya-movie-pre-release-event5

గౌత‌మ్ తిన్న‌నూరి మాట్లాడుతూ – “నిర్మాత రాహుల్ కొత్త ద‌ర్శ‌కుల‌పై న‌మ్మ‌కంతో సినిమా చేయ‌డం గొప్ప విష‌యం. నాకు కూడా త‌నే డైరెక్ట‌ర్‌గా అవ‌కాశం ఇచ్చాడు. భ‌విష్య‌త్‌లో చాలా మంది కొత్త వారిని ప‌రిచ‌యం చేయాల‌ని కోరుకుంటున్నాను. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌` చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

agent-srinivasa-athreya-movie-pre-release-event4

చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ గారు చేసిన సపోర్ట్ మర్చిపోలేనిది.. అయన కు నా ప్రత్యేక కృతజ్ఞతలు.. కొత్తవాళ్ళని ఇంట్రడ్యూస్ర్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాను.. మళ్ళీ రావా సినిమా తో గౌతమ్ మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చాడు.. ఐదుగురి ని ఇండస్ట్రీ కి పరిచయం చేయాలనీ నిశ్చయించుకున్నాను.. ఈ సినిమా ను అందరు చూసి విజయవంతం చేయాలనీ కోరుకుంటున్నాను అన్నారు..

agent-srinivasa-athreya-movie-pre-release-event1

కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు మహా వెంకటేష్ మాట్లాడుతూ.. మొదటిసారి ఈ సినిమా టైటిల్ విన్నప్పుడు చాల పెద్ద టైటిల్ పెట్టారనుకున్నాను.. ఇండస్ట్రీ కి చాల మంది కొత్త దర్శకులు వస్తున్నారు.. కానీ స్వరూప్ చాల మంచి సినిమా తో వస్తున్నారు.. నవీన్ పోలిశెట్టి సినిమా లు చూశాను.. మంచి యాక్టర్.. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది.. కథ చాల ఫ్రెష్ గా ఉంది.. అందరికి అల్ ది బెస్ట్ అన్నారు..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent Sai Srinivasa Athreya
  • #Mark K Robin
  • #Naveen Polishetty
  • #Rahul Yadav Nakka
  • #Shruti Sharma

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

trending news

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

37 mins ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

53 mins ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

1 hour ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

3 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

4 hours ago

latest news

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

22 hours ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

23 hours ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

1 day ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

1 day ago
Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version