“వీడి చర్యలు ఊహాతీతం” అనే త్రివిక్రమ్ శైలి సహజమైన సంభాషణతో ముగుసిన “అజ్ణాతవాసి” టీజర్ చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకొంటుంటే.. సినిమా అభిమానులందరూ పవన్ కళ్యాణ్ ను చూసి మురిసిపోతున్నారు. ఆద్యంతం ఆకట్టుకొంటూ, ఆశ్చర్యపరుస్తూ అలరించే విధంగా టీజర్ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ కొంటె కృష్ణుడిని తలపిస్తుండగా.. టీజర్ బ్యాగ్రౌండ్ లో ప్లే అయిన సాంగ్ ను ఒక్కసారి జాగ్రత్తగా వింటే..
“మధురాపురి సదనా, మృధు వదన మధుసూదనా ఇహ స్వాగతం కృష్ణా, చరణాగతమ్ కృష్ణా,
ధీరమునిజన విహార వదన సుకుమార ధైత్య సంహార దేవ, మధుర మధుర రతి సాహస సాహస వృజన యువతి జానా మాసన పూజిత
స ,గప, గరి, ప గ రి స గ స ,
స రి గ ప ద, స ప… సగ రి.ప గ రి స గ సా
తిటక జనుతాం తకజనుతాం తతకి టకజనుతాం
తకతరి కుకుంతన కితతకదీం
తకతరి కుకుంతన కితతకదీం
తకతరి కుకుంతన కితటక ధీం”
దీని భావమేమనగా…
మధురాపురి నుండి దిగివచ్చిన శ్రీకృష్ణా నీకు స్వాగతం..
చెడును అంతమొందించే జనపాలకా నీకు స్వాగతం..
మగువల మనసు దోచే మృధుభాషి నీకు స్వాగతం..
సో, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను త్రివిక్రమ్ గారు ఎంతో ప్రేమతో శ్రీకృష్ణుడితో పోల్చడం జరిగింది. కావున మన పవన్ కళ్యాణ్ గారు కథ ప్రకారం కృష్ణుడివలే తాను అనుకొన్న పనిని సామ ధాన భేద దండోపాయాలతో సాధించుకొంటాడన్నమాట. ఆయన లీలలు చూసి మిగిలినవారంతా ఆశ్చర్యపోతుంటారు.
సందర్భానుసారమైన పాటలు, తెరకెక్కించడంతో, మాటలు రాయడంలో సిద్ధహస్తుడైన త్రివిక్రమ్ “అజ్ణాతవాసి” టీజర్ విషయంలో కూడా లిరిక్స్ అనేవి ప్రతి ఫ్రేమ్ కి సింక్ అయ్యేలా తీసుకొన్న జాగ్రత్తకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే.
ఓవరాల్ గా.. కాస్త “అత్తారింటికి దారేది” ఫ్లేవర్ ఎక్కువగా కనిపిస్తున్నా.. క్లాసిక్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి కావాల్సిన అన్నీ అంశాలూ పుష్కలంగా ఉన్న చిత్రం “అజ్ణాతవాసి”.
డియర్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆల్రెడీ గంటలోపే 100K లైక్స్ తో రికార్డ్ సృష్టించి.. మరిన్ని రికార్డుల వేటలో తనమునకలై ఉన్నారు.