మళ్ళీ కాపీ కొట్టిన త్రివిక్రమ్!

“అజ్ణాతవాసి” సినిమా ఒక ఫ్రెంచ్ సినిమా “లర్గో వించ్”కి కాపీ అని, అందువల్ల సదరు సినిమా ఇండియన్ రీమేక్ రైట్స్ కొన్న టి-సిరీస్ సంస్థకి త్రివిక్రమ్ అండ్ టీం దాదాపు 10 కోట్ల రూపాయలు చెల్లించి సెటిల్ చేసుకొందని గత కొన్ని వారాలుగా వస్తున్న వార్తలు అందరికీ తెలిసే ఉంటాయి. అయితే.. ఇవాళ సినిమా చూసిన వాళ్ళందరూ “కథ సేమ్ కాదు కానీ..” అని చెబుతూనే “చాలా సీన్స్ మాత్రం సేమ్ టు సేమ్ ఉన్నాయి” అనేస్తున్నారు. కెమెరా యాంగిల్ నుంచి, స్క్రీన్ పేస్ వరకూ సేమ్ టు సేమ్ ఉన్నాయట చాలా సన్నివేశాలు.

అయితే.. త్రివిక్రమ్ కొన్ని సన్నివేశాలను కొన్ని హాలీవుడ్ సినిమాల నుంచి లేపేయడం సారీ ఇన్స్పైర్ అవ్వడం అనేది ఎప్పట్నుంచో జరుగుతూనే ఉంది. “మల్లీశ్వరి” సినిమా కోసం షాపింగ్ మాల్ ఎపిసోడ్ మొత్తం “మైనారిటీ రిపోర్ట్” అనే ఆంగ్ల చిత్రం నుంచి కాపీ కొట్టిన త్రివిక్రమ్, “జులాయి” సినిమాలోని బ్యాంక్ దొంగతనం ఎపిసోడ్ ను “డార్క్ నైట్” సినిమా నుంచి కాపీ కొట్టి దొరికిపోయాడు. అయితే.. ఇదివరకూ ఈ తరహా విషయాలు సినిమా రిలీజైన 50 రోజులకో లేదా పూర్తిగా థియేటర్ల నుంచి వెళ్లిపోయాకో తెలిసేవి. కానీ.. ప్రస్తుతం అందరు ఇంటర్నెట్ పుణ్యమా అని అందరు ప్రపంచంలో ఏ చిత్రాన్నైనా చూడగలుగుతున్నారు. అందువల్ల సినిమా ఫస్ట్ ఆట పూర్తయ్యేసరికే ఆ సినిమా మూల కథ ఎక్కడిది, ఎన్ని సన్నివేశాలు కాపీ వంటి విషయాలు తెలిసిపోతున్నాయి.

అదే విధంగా ఇప్పుడు “అజ్ణాతవాసి”లో కూడా “లార్గో వించ్” ను కాపీ చేయబడ్డ సన్నివేశాలు చాలా ఉన్నాయట. అందుకే టి-సిరీస్ తో డీల్ సెట్ చేసుకొన్నారు త్రివిక్రమ్-చినబాబు. ఇండస్ట్రీలో అందరూ ఎంతో గౌరవంగా “గురూజీ” అనే పిలుచుకొనే త్రివిక్రమ్ ఇలాంటి చర్యల వల్ల తనపై ఉన్న మర్యాదను పోగొట్టుకొంటున్నాడనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus