ప్రచారంలో ఉన్న అజ్ఞాతవాసి డైలాగులు ఇవే!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం “అజ్ఞాతవాసి”. అను ఇమ్యానుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రారంభం నుంచి క్రేజీ ప్రాజెక్ట్ గా నిలిచింది. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ టీజర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ టీజర్ అంచనాలను పెంచింది. దీంతో ఈ మూవీ గురించి మరింత విషయాలు తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆరాటం పెరిగింది. వారికోసమే అన్నట్టుగా.. అజ్ఞాతవాసి సినిమాలో డైలాగులు ఇవే అంటూ కొన్ని బయటికి వచ్చాయి. అవి త్రివిక్రమ్ మార్క్ తో ఉండడంతో.. ఇవి సినిమాలో ఉంటాయని అందరూ అనుకుంటున్నారు. అవి ఏమిటంటే..

కష్టాలు చెప్పుకోవడానికి బాగుంటాయి కాని.. భరించడానికే ఇబ్బందిగా ఉంటాయి

మనకు తెలిసింది అవతలి వాళ్లకు పరిచయం చెయ్యాలి.. మనం తెలియంది పరిచయం చేసుకోవాలి

నా కోపానికి మార్కులు ఉండవు.. ఒక వేళ ఉంటే మాత్రం వందకు వంద ఉంటాయి పిన్ని

నవ్వంటే సంతోషం అనుకునే లోపే.. ఏడుపంటూ ఒకటుందని గుర్తు చేస్తుంది జీవితం అభిజిత్

ఏమున్నారండి అలనాటి సావిత్రి సౌందర్యని గుర్తు చేసారండి.. మీరు మరీ జోక్ చేస్తారండి
బక్క చిక్కిన చిరంజీవి లా ఉంటారండి

ఈ ఇంట్లో పోలిటిక్స్ ఎక్కువ. ఒకడిని తోక్కేయ్యడాన్ని పాలిటిక్స్ అనరు. ఒకడికోసం బ్రతకడాన్ని పోలిటిక్స్ అంటారు

ముందు ఓడిన వాడు గెలవడం సులువు. కాని గెలిచిన వాడు మళ్లీ గెలవడం ఖాయం

నువ్వు టైం ఇచ్చేకొద్దీ భయపడ్డావ్. నేను టైం ఇచ్చే కొద్దీ రెచ్చిపోతా

అవసరం కోసం అబద్ధాలు చెప్పేవాడికి.. నిజాయితీగా నిజాలు చెప్పేవాడికి చాలా తేడాలు ఉంటాయి సార్

ఆశించే వాడికి శాసించడం రాదు.. శాశించే వాడికి ఆశించడం రాదు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus