అల్లు అర్జున్ బాటలో పవన్ కళ్యాణ్!

  • December 2, 2017 / 06:32 AM IST

ఈ మధ్య మన తెలుగు స్టార్ హీరోలందరూ పరాయి భాషల్లోనూ తమ మార్కెట్ ను విస్తరింపజేయడానికి సుముఖత చూపుతున్నారు. అల్లు అర్జున్ ఆల్రెడీ మలయాళంలో విశేషమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకొన్న విషయం తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీయార్ లు కూడా తమిళనాట కూడా తమ చిత్రాలను విడుదల చేస్తూ అక్కడ కూడా క్రేజ్ సంపాదించి, తమ మార్కెట్ వేల్యూ పెంచుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే.. అల్లు అర్జున్ రేంజ్ లో ఎవరూ ఆ స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నాడని తెలుస్తోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న “అజ్ణాతవాసి” చిత్రం జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మలయాళంలోనూ విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ కి తెలుగులో తిరుగులేని క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పుడా క్రేజ్ ను పెంపొందించాల్సిన అవసరం వచ్చింది. అందుకే “అజ్ణాతవాసి”ని మలయాళంలోనూ రిలీజ్ చేస్తారట. ఒకవేళ తెలుగు-మలయాళ భాషల్లో హిట్ అయితే.. తమిళంలోనూ డబ్బింగ్ రూపంలో విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus