పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే తెలియని వైబ్రేషన్ బాడీలోకి ఎంటరైపోతుంది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపించగానే అభిమానులకి పూనకాలు వచ్చేస్తే.. ఆయన అభిమానులు కానివారి కళ్ళలో వెలుగు వస్తుంది. పవర్ స్టార్ మ్యానియా అలాంటిది. అందుకే టాక్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ డిజాస్టర్ సినిమాలు కూడా 100 కోట్లు సునాయాసంగా కలెక్ట్ చేసేస్తుంటాయి. అలాంటిది భీభత్సమైన పాజిటివ్ టాక్ నడుమ నేడు విడుదలైన “అజ్ణాతవాసి” ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాల్లో 300 కోట్లు కలెక్ట్ చేయడం సర్వసాధారణం అని అందరూ ఫిక్స్ అయిపోయారు.
కట్ చేస్తే.. సినిమా రిలీజై ఇంకా 24 గంటలు కూడా గడవక ముందే “అజ్ణాతవాసి”పై నెగిటివ్ రిపోర్ట్స్ పెల్లుబికాయి. సినిమా ఎక్స్ పెక్టేషన్స్ ను అందుకోలేకపోయిందని కొందరు, త్రివిక్రమ్ డైలాగ్స్ తప్ప సినిమాలో కంటెంట్ ఏమీ లేదని ఇంకొందరు, పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ తప్ప సినిమాలో మరేమీ లేదని మరిందరు. ఇలా సోషల్ మీడియాలో ప్రీమియర్ షోలు మరియు బెనిఫిట్ షోలు చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు చెబుతుండడం ఆశ్చర్యకరం.
అయితే.. త్రివిక్రమ్ సినిమాలకు తొలుత నెగిటివ్ టాక్ రావడం అనేది సర్వసాధారణం. ఆయన మునుపటి చిత్రాలు “అతడు, జల్సా, అ ఆ” చిత్రాలకు కూడా ఇదే విధంగా మొదటి రెండ్రోజులు విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ సినిమాలు మంచి హిట్ అయ్యాయి. సొ పవన్ కళ్యాణ్ మ్యాజిక్, త్రివిక్రమ్ మాటలు “అజ్ణాతవాసి”కి హిట్ చేస్తాయా లేక ప్రస్తుతం నడుస్తున్న ఈ నెగిటివ్ టాక్ పైచేయి సాధించి సినిమాను యావరేజ్ గా నిలుపుతాయా అనేది తెలియాల్సి ఉంది. అయితే… ఫిల్మీఫోకస్ ఇచ్చే జెన్యూన్ & అన్ బయాస్డ్ రివ్యూ కోసం మాత్రం ఇంకొన్ని గంటలు వేచి ఉండాల్సిందే.