Untoppable3: అన్ స్టాపబుల్3 కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ ఇదే!

బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో ప్రసారమైన అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ హిట్ అనే ప్రశ్నకు సంబంధించి సమాధానం అందరికీ తెలుసు. ఈ షో వల్లే ఆహా ఓటీటీ సబ్ స్క్రైబర్ల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగింది. అయితే అన్ స్టాపబుల్3 ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతున్న సమయంలో అన్ స్టాపబుల్3 షో ఫస్ట్ ఎపిసోడ్ దసరా కానుకగా స్ట్రీమింగ్ కానుందని వార్తలు జోరుగా వినిపించాయి.
అయితే అన్ స్టాపబుల్3 లిమిటెడ్ ఎడిషన్ అంటూ ఆహా ఓటీటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోను రిలీజ్ చేసింది.

ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ ల విషయంలో వేర్వేరు పేర్లు వినిపిస్తుండగా ఎవరు ఫైనల్ అవుతారో చూడాల్సి ఉంది. “గెలుపే ఊపిరిగా పట్టుదలే ప్రాణంగా ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్ స్టాపబుల్ దెబ్బకు థింకింగ్ మారిపోవాలా ఈ పేరు చాలా ఏళ్లు యాదుంటాది కలుద్దాం ఆహాలో” అనే డైలాగ్ తో ప్రోమోలో బాలయ్య అదరగొట్టారు. ఈ షోను అన్ స్టాపబుల్3 గా భావించవద్దని (Untoppable3) అన్ స్టాపబుల్2 కు కొనసాగింపుగా భావించాలని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

బాలయ్య ఈ షోతో ఆహా ఓటీటీ రేంజ్ ను మరింత పెంచడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భగవంత్ కేసరి సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. భగవంత్ కేసరి మూవీ రిజల్ట్ విషయంలో అనిల్ రావిపూడి పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య లుక్, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉండనున్నాయని తెలుస్తోంది.

ఈ సినిమాలో ట్విస్టులు సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని సమాచారం అందుతోంది. భగవంత్ కేసరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus