బ్రిటన్ రాకుమారుడు విలియమ్ భారత పర్యటన నేపథ్యంలో ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఐశ్వర్యారాయ్ హాజరైంది. ఈ ప్రోగ్రాంకు వచ్చి ఫొటోలకు పోజులిస్తున్న సమయంలో ఎదురుగా ఉన్న జర్నలిస్టుల్లో ఒక ఫారిన్ పాత్రికేయుడిని ఐష్ గుర్తించింది. అతని దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలో జర్నలిస్ట్ ఐష్ చేతిని దగ్గరికి తీసుకుని ముద్దు కూడా పెట్టేశాడు. దీంతో అక్కడున్నవాళ్లంతా అవాక్కయ్యారు. ఐష్ కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోయి.. తర్వాత నవ్వేసి వెళ్లిపోయింది. అది ఫారెన్ కాబట్టి ఐష్ ఊరుకుంది కానీ ఇలా ఓ ఇండియన్ జర్నలిస్ట్ చేస్తే లైట్ తీసుకుంటుందా అనేది సందేహం..!