ఐశ్వర్య రాయ్ రిజెక్ట్ చేసిన రజినీకాంత్ సూపర్ హిట్ సినిమాలు ఇవే…!

‘రోబో’ చిత్రంలో సన పాత్రలో ఐశ్వర్య రాయ్ తన గ్లామర్ తో చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. తన మామగారి వయసు ఉన్న రజినీ కాంత్ సరసన ఈమె నటించడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. శ్రీదేవి తర్వాత ఆ రేంజ్ లో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది ఈ బ్యూటీనే. నిజానికి ఈమె మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ‘ఇద్దరు’ అనే సూపర్ హిట్ చిత్రంతో పరిచయం అయ్యింది. అది కూడా ఓ సౌత్ సినిమాతోనే..! అయితే ఈమె బాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తమిళంలో కూడా ఈమె అజిత్ వంటి హీరోలతో సినిమాలు చేసింది.

అయితే ఎప్పటి నుండో.. అంటే ‘రోబో’ చిత్రానికి ముందే రజినీ కాంత్ తో నటింప చెయ్యాలి అని దర్శక నిర్మాతలు ప్రయత్నించారట. అయితే ఈమె రిజెక్ట్ చేస్తూ వచ్చిందట. మొదట రజినీ సూపర్ హిట్ చిత్రం ‘పడయప్ప’ (నరసింహ) లో ఐశ్వర్య రాయ్ ను తీసుకోవాలి అనుకున్నారట. అందులో నీలాంబరి పాత్రకు ఐశ్వర్య రాయ్ ను సంప్రదించగా ఆమె నెగిటివ్ రోల్ అని రిజెక్ట్ చేసిందట.ఇక రజినీ కాంత్ -సురేష్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘బాబా’ చిత్రంలో మొదట ఐశ్వర్య రాయ్ ను తీసుకోవాలని భావించారట. కానీ ఈ సినిమాకి కూడా ఆమె ఒప్పుకోలేదు.. దాంతో మనీషా కోయిరాలా ను తీసుకున్నారు.

ఇక ‘చంద్రముఖి’ చిత్రంలో కూడా జ్యోతిక పాత్రకు ఐశ్వర్య రాయ్ ను అనుకున్నారట. దానికి కూడా ఈమె ఒప్పుకోలేదు.దీని తరువాత ‘శివాజీ’ చిత్రంలో కూడా శ్రీయ ఎంతకు ముందు ఐశ్వర్య రాయ్ ను అనుకున్నారట దర్శకుడు శంకర్. అయితే ఈ ఆఫర్ ను కూడా రిజెక్ట్ చేసింది ఐశ్వర్య రాయ్. చివరిగా రోబో చిత్రంలో ఈమె పాత్ర నచ్చడంతో ఒప్పుకుంది అని తెలుస్తుంది. ఇలా నాలుగు సార్లు సూపర్ స్టార్ సినిమాలను రిజెక్ట్ చేస్తూ వచ్చింది మన అమితాబ్ బచ్చన్ కోడలు.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
సమంత బర్త్ డే స్పెషల్ : రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus