నేరేడు పెదవుల ఐష్

అందానికి ఐకాన్ ఐశ్వర్యరాయ్. పెళ్లి అయ్యి, ఒక పాప ఉన్నా కూడా అభిమానులు ఆమెను తమ కలల సుందరి గానే భావిస్తారు. ఈ ప్రపంచ సుందరి నడిచినా.. మాట్లాడినా.. మౌనంగా ఉన్నా “వాహ్.. ఎంత బాగుంది” అంటారు. వారి అభిమానం ఎల్లప్పుడూ ఉండాలని ఐష్ జాగ్రత్త పడుతుంటుంది. నలభై ఏళ్లు ఫై బడినా టీనేజ్ అమ్మాయిలా కనిపించడానికి మేకప్, డ్రస్స్, హెయిర్ స్టైల్ .. ఇలా అన్నీ విషయాలలో శ్రద్ధ తీసుకుంటుంది. అందుకే ఆమె ఇప్పటి వరకు అభినందనలే అందుకుంది. కానీ తొలి సారి కేన్స్ వేదికగా విమర్శలు చవి చూసింది.

ప్రస్తుతం ఫ్రాన్స్ లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతోంది. ఈ వేడుకకు ఐష్ హాజరైంది. తొలి రెండు రోజుల్లో తన తరగని అందంతో, బంగారు రంగుల దుస్తుల్లో కనిపించి కట్టి పడేసింది. ఫెస్టివల్ ల్లో భాగంగా శనివారం సాయంత్రం ఐష్ నటించిన “సరబ్ జీత్” సినిమా స్క్రీనింగ్ ఉన్నింది. ఈ కార్యక్రమానికి ఐశ్వర్యరాయ్ లేత గులాబి రంగులో ఉన్న గౌన్ ని ధరించి వచ్చింది, రెడ్ కార్పెట్ ఫై స్టైల్ గా నిలబడి ఉన్నఐష్ ను చూసి అక్కడున్నవారంతా షాక్ తిన్నారు. ఎర్రగా ఉండాల్సిన పెదాలు తన రంగును మార్చుకొని ఐష్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేసాయి.

ఆ లిప్ స్టిక్ తో ఆమె చిత్రాన్ని నెట్ లో చూసిన అభిమానులు తట్టుకోలేక పోయారు. మేకప్ వేసిన వాడి ఫై కేసు పెట్టాలని విరుచుకుపడ్డారు. నేరేడు పళ్ళు తినేసి వచ్చిందా ? పర్పుల్ కలర్ లిప్ స్టిక్ తప్ప వేరేది దొరకలేదా ? అని విమర్శించారు.

ఐశ్వర్యరాయ్ పదిహేనేళ్ళుగా లోఓరల్ లిప్ స్టిక్ కంపనీకి ప్రచార కర్తగా ఉన్నారు. ఈ ఏడాది వారు కొత్త గా ఈ రంగు లిప్ స్టిక్ ను మార్కెట్లోకి ప్రవేశ పెడుతున్నారు. ఇందుకోసం ఐష్ ఈ రంగుతో కన్పించినట్లు మార్కెట్ వర్గాలు చెప్పాయి. “కొత్త నిర్ణయం మొదట వ్యతిరేకించ బడుతుంది. తర్వాత అంగీకరించబడుతుంది”. బహుశ ఇది కూడా అంగీకరించబడుతుందేమో వేచి చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus