మలయాళ సినిమా ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక రావడంతో.. మరోసారి భారీ స్థాయిలో వినిపిస్తున్న పేరు ‘క్యాస్టింగ్ కౌచ్’. అన్ని రంగాల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఈ పేరు వినిపిస్తూ ఉంటుంది. జస్టిస్ హేమ కమిటీ విషయంలో డిస్కషనే ఇంకా ఓ కొలిక్కి రాలేదు.. టాలీవుడ్ జానీ మాస్టర్ (Jani Master) విషయం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో క్యాస్టింగ్ కౌచ్ విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో కథానాయిక ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) స్పందించింది. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఎలా వ్యవహరించాలి అనే విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నేను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు 12 ఏళ్లు అవుతోంది. కాలానుగుణంగా పరిశ్రమలో చాలా మార్పులు జరిగాయి. అయితే చిత్ర పరిశ్రమలో నేను ఎలాంటి వేధింపులు ఎదుర్కోలేదు అని చెప్పింది ఐశ్వర్య రాజేశ్.
వేధింపులకు పాల్పడిన దోషులకు శిక్ష పడాలి. చిత్ర పరిశ్రమకు సంబంధించి మహిళలకు ఈ విషయంలో నేను ఇచ్చే సలహా ఒక్కటే. మీరు ధైర్యంగా ఉండండి, మీ విషయంలో అభ్యంతరకరంగా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే వెంటనే స్పందించండి. మీ వాయిస్ రెయిజ్ చేయండి అని చెప్పింది ఐశ్వర్య. అలాగే అవుట్‌డోర్ చిత్రీకరణకు వెళ్లినప్పుడు సరైన వసతుల్లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పింది. సరైన టాయిలెట్స్ ఉండటం లేదని చెప్పింది.
ఇక ఐశ్వర్య సినిమాల గురించి చూస్తే.. 14 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె తెలుగులో సరైన విజయం అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు వెంకటేశ్ (Venkatesh) – అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఎక్స్‌లెంట్ వైఫ్‌గా కనిపించబోతోంది అని టీమ్ ఇప్పటికే తెలిపింది. ఇది కాకుండా తమిళ సినిమాలు ‘కరుప్పుర్ నగరం’, ‘మోహన్‌దాస్’, ‘తీయవర్ కులైగల్ నడుంగ’.. మలయాళ సినిమా ‘హర్’, కన్నడ చిత్రం ‘ఉత్తరాకాండ’లో నటిస్తోంది.