Aishwarya, Dhanush: విడాకుల తర్వాత భర్త పేరును ప్రస్తావించిన ఐశ్వర్య.. అలా చెప్పడంతో?

కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో ధనుష్ కు మంచి గుర్తింపు ఉంది. ఎంతో కష్టపడి స్టార్ స్టేటస్ ను అందుకున్న ధనుష్ (Dhanush) కుబేర సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలో నటిస్తుండగా భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఐశ్వర్య (Aishwarya Rajinikanth) తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ (Anirudh Ravichander) సక్సెస్ కు ధనుష్ కారణమని కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఎదగడానికి కారణం ధనుష్ అని ఆమె తెలిపారు. అనిరుధ్ ను విదేశాలకు పంపించి చదివించాలని కుటుంబ సభ్యులు ఆలోచించగా ధనుష్ వాళ్ల మనస్సు మార్చి అనిరుధ్ కు కీబోర్డ్ కొని ఇచ్చాడని ఐశ్వర్య వెల్లడించారు. 3 సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేయాలనే ఆలోచన ధనుష్ దని ఆమె పేర్కొన్నారు. అనిరుధ్ ఎదుగుదల చూస్తే అంతోషంగా ఉందని ఐశ్వర్య చెప్పుకొచ్చారు.

విడాకుల తర్వాత ఐశ్వర్య ధనుష్ గురించి పాజిటివ్ గా ప్రస్తావించడం హాట్ టాపిక్ అవుతోంది. ధనుష్ ఐశ్వర్య భవిష్యత్తులో మళ్లీ కలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ధనుష్ కుబేర ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల ఈ మధ్య కాలంలో తన అద్భుతమైన ట్రాక్ రికార్డ్ తో క్రేజ్ పెంచుకుంటున్నారు.

కుబేర సినిమా కథ గురించి వైరల్ అవుతున్న వార్తలు సైతం ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. అనిరుధ్ తెలుగులో కూడా వరుసగా ఆఫర్లతో బిజీ అవుతున్నారు.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus