‘కబాలి’ క్లైమ్యాక్స్ పై టెన్షన్ పెరుగుతుంది!!!

ప్రపంచ ప్రేక్షకులు అందరూ ఆశగా, ఆతురతగా ఎదురుచూస్తున్న తమిళ తలైవార్ రజనీకాంత్ ‘కబాలి’ చిత్రంపై ఒక్కో విషయం ఒక్కో రోజు బయటకు వస్తుంది. అయితే రోజురోజుకూ ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోతున్న క్రమంలో ఈ సినిమా క్లైమ్యాక్స్ పై అనుకోని ట్విష్ట్ ఇచ్చాడు దర్శకుడు రంజిత్. ఈ సినిమాలోని క్లైమ్యాక్స్ మార్చాల్సిందే అని రజని కూతురు దర్శకుడి పై ఎంతో ఒత్తిడి తెచ్చిందంటా… అయితే ఈ విషయాన్ని సినిమా దర్శకుడె బయటపెట్టాడు… చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ…ఈ సినిమా చూసిన తర్వాత విషాదభరితంగా ఉన్న క్లయిమాక్స్‌ని ఎడిట్‌ చేసి, హ్యాపీ ఎండింగ్‌ ఇవ్వాల్సిందేనని సౌందర్య రజనీకాంత్‌, ఈ సినిమా థాను ఇద్దరూ తన పై విపరీతమైన ఒత్తిడి తీసుకువచ్చిన విషయాన్ని బయటపెట్టాడు.

అంతేకాకుండా తాను వ్రాసుకున్న కథ ప్రకారం ఈ సినిమా నిర్మిస్తున్నప్పుడు అనేక అభిప్రాయ భేదాలు తనకు రజినీకాంత్ కుమార్తెకు వచ్చినా తాను వ్రాసుకున్న కథను మార్చకుండా క్లైమాక్స్ గా తీశానని, అదే క్రమంలో రజని సైతం తనకే అండగా నిలిచారని తెలిపాడు దర్శకుడు. మరి సాక్షాత్తూ సినిమా దర్శకుడె ఈ సినిమా క్లైమ్యాక్స్ పై ఇలాంటి ట్విష్ట్ ఇవ్వడంతో….ఇప్పుడు రజని అభిమానులంతా ఈ సినిమా క్లైమ్యాక్స్ పై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus