Ajay Bhupathi, Karthikeya: ‘ఆర్‌ఎక్స్‌ 100’ రుణం తీర్చుకుంటున్న డైరక్టర్‌.. సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుందా?

తనకు తొలి సినిమా అందులో బ్లాక్‌బస్టర్‌ సినిమా చేసిన హీరో, హీరోయిన్లకు సరైన హిట్లు లేనప్పుడు, ఆ దర్శకుడికి కూడా సరైన విజయం దక్కనప్పుడు ఆ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ పరిస్థితిని దాటడానికి ఆ దర్శకుడు డేరింగ్ స్టెప్‌ వేస్తే… అదే ‘మంగళవారం’. ఈ పేరు చెప్పగానే మీకు మొత్తం విషయం అర్థమైపోయుంటుంది. అవును దర్శకుడు అజయ్‌ భూపతి, హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ గురించే. అంతేకాదు హీరో కార్తికేయ గురించి కూడా.

ఎందుకంటే తనతో తొలి సినిమా చేసిన పాయల్‌ రాజ్‌పుత్‌కు ‘మంగళవారం’ సినిమాతో భారీ విజయం అధించింది, కెరీర్‌ను తిరిగి ఫుల్‌ స్వింగ్‌లోకి తీసుకొచ్చిన అజయ్‌ భూపతి… ఇప్పుడు తొలి సినిమా ‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరో కార్తికేయ గుమ్మకొండకు కూడా సినిమా చేసే పనిలో ఉన్నారట. ‘మంగళవారం’ తర్వాత అజయ్‌ భూపతి చేయబోయే సినిమ ఇదే అని టాక్‌. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కార్తికేయ‌తో అజ‌య్ ఓ సినిమా ప్లాన్ చేశారట.

రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా నడుస్తుందని సమాచారం. ప్యాక్షన్ నేపథ్యంలోనే ఈ సినిమా ఉంటుందని, అయితే ఇప్పటివరక వచ్చిన ఫ్యాక్షన్‌ సినిమాలకు ఇది చాలా దూరంగా ఉంటుందని చెబుతున్నారు. యాక్ష‌న్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా కథ ఇంటెన్స్‌తో ఉంటుందని చెబుతున్నారు. వరుస సినిమాలు చేసినా సరైన ఫామ్‌లో లేని కార్తికేయ ఈ సినిమాతో భారీ విజయం అందుకుంటాడని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.

‘మంగళవారం’ సినిమా పాయల్‌ రాజ్‌పుత్‌కు ఎలాంటి విజయం అందించిందో… ఇప్పుడు చేయబోయే రాయలసీమ సినిమా కూడా అంతే విజయం అందించాలని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సమయంలో ఈ ముగ్గురినీ ఎవరూ ముందు విశ్వసించలేదు. ఏదో సగటు సినిమా అనుకున్నారంతా. అయితే సినిమా వచ్చాక ఇది నార్మల్‌ మూవీ కాదని స్పష్టంగా అర్థమైపోయింది. ఆ తర్వాత అజయ్‌ భూపతి చేసిన ‘మహా సముద్రం’ తేడాకొట్టేసింది. ఇక పాయల్‌, కార్తికేయ (Karthikeya) కూడా వరుస సినిమాలు చేసినా విజయం దక్కలేదు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus