సంక్రాంతి బరి నుండి స్టార్‌ హీరో సినిమా అవుట్‌… ఎప్పుడూ చెప్పే కారణమే!

ఈ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు ఏవి అంటే.. తెలుగు ప్రేక్షకులు మూడు సినిమాలు పేర్లు చెబుతారు. నిజానికి వచ్చేవి మూడే. అయితే సౌత్‌ సినిమా నుండి లెక్క చూసుకుంటే నాలుగు సినిమాలు పొంగల్‌ ఫైట్‌కి బరిలో ఉన్నాయి. అయితే ఆ సినిమా ఇప్పుడు పక్కకు తప్పుకుంది. దీంతో మొత్తంగా మూడు సినిమాలో పోరులో నిలుస్తున్నాయి. ఆ వెళ్లిపోయిన సినిమా ‘విదా మయూర్చి’ (Vidaamuyarchi) కాగా.. ఉన్న మూడు సినిమాలు ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) , ‘డాకు మహారాజ్‌’(Daaku Maharaaj), ‘సంక్రాంతికి వస్తున్నాం’.

Ajith

ఇటీవల తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న అజిత్‌ (Ajith) .. ఈ సంక్రాంతికి ‘విదాముయార్చి’తో వస్తాను అని కొన్ని రోజుల క్రితం అనౌన్స్‌ చేశాడు. నిజానికి ఆ టైమ్‌కి మైత్రీ మూవీ మేకర్స్‌ వారి ‘గుడ్‌ బ్యాగ్‌ అగ్లీ’ సందడి చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ‘విదా మయూర్చి’కి లైన్‌ ఇవ్వడానికి ఆ సినిమాను పక్కకు జరిపారు. అయితే ఇప్పుడు ఆ సినిమా కూడా సైడ్‌ అయిపోయింది.

అనుకోని కారణాల వల్ల ‘విదాముయార్చి’ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయలేకపోతున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం అని నిర్మాణ సంస్థ ఓ ప్రకటన చేసింది. దీంతో ఆయన అభిమానులు నిరాశచెందారు. కారణాలు టీమ్‌ చెప్పకపోయినా థియేటర్ల సర్దుబాటు విషయంలో ఇబ్బందులు, సమస్యల వల్లే సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుంది అని అంటున్నారు.

ఇక రామ్‌చరణ్‌ (Ram Charan)   – దిల్‌ రాజు (Dil Raju) – శంకర్‌ (Shankar)  ‘గేమ్‌ ఛేంజర్‌’ జనవరి 10న విడుదల కానుంది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) – బాబీ (Bobby)  ‘డాకు మహారాజ్‌’ జనవరి 12న తీసుకొస్తున్నారు. వెంకటేశ్ (Venkatesh)  – అనిల్ రావిపూడి  (Anil Ravipudi) సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) జనవరి 14న రిలీజ్‌ చేస్తున్నారు. దీంతో ఈసారి పోరు త్రిముఖంగా మారిపోయింది. అన్నట్లుగా ఐదో సినిమా కూడా బరిలో ఉండాలి అనుకుంది. అదే సందీప్‌ కిషన్‌  (Sundeep Kishan) ‘మజాకా’. ఎందుకో కానీ ఆదిలోనే ఆ సినిమా బరి నుండి తప్పుకుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus