గత కొన్నేళ్లుగా తమిళ సినిమా పరిశ్రమ, జపాన్ చిత్ర పరిశ్రమకు ఓ బ్రిడ్జ్‌లా పని చేస్తూ.. కోలీవుడ్ సినిమాలను గౌరవిస్తూ వస్తోంది ఒసాకా (Osaka Awards) తమిళ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. ఈ సంస్థ ఇప్పుడు 2023 ఏడాదికి చెందిన తమిళ సినిమాలకు పురస్కారాలను అందజేసింది. బుధవారం జరిగిన ఈ వేడుకలో విజయ్ ‘లియో’ (LEO) సినిమాకు గరిష్ఠంగా ఆరు విభాగాల్లో అవార్డులు వచ్చాయి. అయితే ఆ సినిమా హీరో విజయ్‌కి (Vijay Thalapathy) మాత్రం పురస్కారం దక్కకపోవడం గమనార్హం.
ఉత్తమ చిత్రంగా ఉయనిధి స్టాలిన్ ‘మామన్నన్’ నిలవగా, ఉత్తమ నటుడిగా ‘తునివు’ (తెగింపు) సినిమాకుగాను అజిత్ (Ajith Kumar) అవార్డు అందుకున్నాడు. ఇక ఉత్తమ నటిగా ‘లియో’ సినిమాలోని నటనగాను త్రిష (Trisha) పురస్కారం గెలుచుకుంది. ‘విడుదలై పార్ట్ 1’ సినిమా దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran) ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) నిలిచారు. ‘మామన్నన్’, ‘పొన్నియిన్ సెల్వన్ 2’ (Ponniyin Selvan: II) సినిమాలకు అందించిన సంగీతానికి ఈ పురస్కారం వచ్చింది.
ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్‌గా విక్రమ్ (Vikram) (పొన్నియిన్ సెల్వన్ 2), ఉత్తమ సహాయ నటిగా ఐశ్వర్యా రాయ్ (Aishwarya Rai Bachchan ) (పొన్నియిన్ సెల్వన్ 2) నిలిచారు. ఉత్తమ విలన్‌గా ఫహాద్ ఫాజిల్ (మామన్నన్) పురస్కారం అందుకున్నాడు. మనోజ్ పరమహంస (Manoj Paramahamsa) (లియో)కు బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డు వచ్చింది. బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్ పురస్కారాన్ని నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilip Kumar) (జైలర్ (Jailer), ఆల్ఫ్రెడ్ ప్రకాశ్, విఘ్నేశ్ రాజా (పోర్ తొళిల్) సంయుక్తంగా అందుకున్నారు. ఉత్తమ నిర్మాణ సంస్థగా ‘గుడ్‌నైట్’ ప్రొడక్షన్ హౌస్‌లు మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎఆర్పీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పురస్కారం అందుకున్నాయి.
‘లియో’లోని నాన్ రెడీ పాటకు బెస్ట్ కొరియోగ్రాఫర్ పురస్కారాన్ని దినేశ్ కుమార్ గెలుచుకున్నారు. ఇక ఎడిటర్‌గా ఫిలోమిన్ రాజ్ (లియో), ఉత్తమ స్టంట్ డైరెక్టర్: అన్బరివు (లియో) నిలవగా, ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌గా మిలాన్ ఫెర్నాండెజ్ (తునివు) నిలిచారు. ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమాకు చేసిన పనికిగాను బెస్ట్ వీఎఫ్‌ఎక్స్ టీమ్ పురస్కారాన్ని అల్జరా స్టూడియో అందుకుంది.