విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఊహించని విధంగా వివాదంలో చిక్కుకున్నాడు. దీంతో ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. విషయం ఏంటంటే 2 రోజుల క్రితం సూర్య నటించిన ‘రెట్రో’ (Retro) ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చాడు. అతను స్పీచ్ ఇచ్చే క్రమంలో కశ్మీర్‌లో చోటు చేసుకున్న పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి ప్రస్తావించాడు. ‘ఈ టెర్రరిస్ట్ నా కొడుకులకి సరైన విద్యను అందించి ఉంటే ఇలాంటి ఘోరాలకు పాల్పడేవారు కాదు.
500 ఏళ్ళ క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు గొడవలకి దిగుతున్నారు’ అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ ట్రైబల్స్ అనే పదం విజయ్ వాడటం పై వివాదం చోటు చేసుకుంది. ఉగ్రవాదులను గిరిజనులతో పోల్చడం అనేది సరైన పద్ధతి కాదని గిరిజన సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. దీంతో విజయ్ వెంటనే బహిరంగంగా క్షమాపణలు తెలిపి తన మాటలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తాడో చూడాలి.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ (Kingdom) సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో 2 భాగాలుగా ఈ సినిమా రూపొందుతుంది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కి మంచి స్పందన లభించింది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. మే 30న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతోంది.