Akhanda 2: ఇట్స్ అఫీషియల్… ‘అఖండ 2’ పోస్ట్ పోన్

బాలయ్య అభిమానులతో పాటు యావత్ తెలుగు సినీ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘అఖండ 2’. అనుకున్నట్టే ఈ సినిమా రిలీజ్‌ వాయిదా పడింది. ముందుగా చెప్పినట్టు సెప్టెంబర్ 25న ఈ సినిమా థియేటర్లలోకి రావడం లేదని మేకర్స్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. సినిమాను ఊహించిన దానికంటే గ్రాండ్‌గా, నెక్స్ట్ లెవెల్ క్వాలిటీతో అందివ్వాలనేదే తమ టార్గెట్ అని టీమ్ ఒక తాజా ప్రకటన ద్వారా వెల్లడించింది.

Akhanda 2

ముఖ్యంగా రీ-రికార్డింగ్, VFX లాంటి కీలకమైన టెక్నికల్ పనులకు మరింత టైమ్ పడుతోందని, ఔట్‌పుట్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతోనే ఈ గ్యాప్ తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబో అంటేనే బాక్సాఫీస్ దగ్గర మోత మోగి పోవాలి. దానికి తోడు ‘అఖండ’ సృష్టించిన రికార్డులు ఈ సీక్వెల్‌పై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాయి. అందుకే, ఆ అంచనాలను మించేలా ఔట్పుట్ కి మెరుగులు దిద్దుతున్నారు.

రిలీజ్ లేట్ అవుతోందని ఫ్యాన్స్ కాస్త డల్ అయినా… ‘వెయిటింగ్‌కు వంద రెట్ల ట్రీట్ ఇస్తాం’ అని టీమ్ భరోసా ఇచ్చింది. క్వాలిటీ, విజువల్స్, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పరంగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయమని ప్రామిస్ చేసింది. చివరగా, ‘ ‘అఖండ 2′ ఒక సినిమా కాదు, అదొక సినిమాటిక్ ఫెస్టివల్’ ట్యాగ్ లైన్ తో హైప్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. మరి ఆ డేట్ ఎప్పుడనేది తెలియాలంటే మాత్రం, ఇంకొంత కాలం ఆగాల్సిందే.

మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus