నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్లో వచ్చిన `అఖండ` చిత్రం విడుదలై 3 వారాలు పూర్తయినప్పటికీ ఇప్పటికీ మంచి కలెక్షన్లను నమోదు చేస్తూనే ఉంది. గతవారం ‘పుష్ప’ వంటి మరో పెద్ద సినిమా విడుదల అయినప్పటికీ ‘అఖండ’ జోరు తగ్గలేదు. ‘ద్వారకా క్రియేషన్స్’ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి.
దీంతో 8రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 3 వారాల కలెక్షన్ల వివరాలను ఓసారి గమనిస్తే :
నైజాం
19.06 cr
సీడెడ్
14.49 cr
ఉత్తరాంధ్ర
5.95 cr
ఈస్ట్
4.00 cr
వెస్ట్
3.65 cr
గుంటూరు
4.55 cr
కృష్ణా
3.46 cr
నెల్లూరు
2.51 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
57.67 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
10.06 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
67.73 cr
‘అఖండ’ చిత్రానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 8 రోజులకే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ చిత్రం 21 రోజులకి గాను రూ.67.73 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవరాల్ గా చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి రూ.13.73 కోట్ల లాభాలు దక్కాయి. మరి 4 వారంలో ‘శ్యామ్ సింగ రాయ్’ అనే క్రేజీ మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ‘అఖండ’ కి ఎన్ని థియేటర్లు మిగుల్తాయో చూడాలి.