500 సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు మృతి.!

చిత్ర పరిశ్రమలో విషాదాల సంఖ్య తగ్గడం లేదు. కొంతకాలంగా చాలా మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు, ఫ్యాషన్ డిజైనర్లు లేదా సినీ పరిశ్రమకు చెందిన వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. కొంతమంది వయసు రీత్యా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మరణిస్తే.. ఇంకొంతమంది హార్ట్ ఎటాక్ లతో,మిగిలిన అనారోగ్య సమస్యలతో మరణిస్తున్నారు. ఇంకొంతమంది అయితే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. టాలీవుడ్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్న సినీ ప్రముఖులు సైతం మరణిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.

తాజాగా ఓ సీనియర్ కన్నడ నటుడు మరణించాడు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నటుడు లోహితస్వ ప్రసాద్ కన్నుమూశాడు. ఇతను ఏకంగా 500 సినిమాల్లో నటించాడు. అలాగే బుల్లితెర పై కూడా అనేక సీరియల్స్ లో ప్రాధాన్యత కలిగిన పాత్రలు పోషించాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్న ఆయన మంగళవారం నాడు బెంగుళూరులోని ప్రైవేట్‌ హస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’ లో ఇతను చిన్న బాలయ్యని అరెస్ట్ చేసే ‘ఎన్.ఐ.ఎ’ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. అలాగే ప్రభాస్ నటించిన ‘సాహో’, ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ ‘అరవింద సమేత’ సినిమాల్లో కూడా నటించారు. లోహితస్వ ప్రసాద్ మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సినీ సెలబ్రిటీలు కోరుకుంటూ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus