సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ పుష్ప కావడం గమనార్హం. ఈ సినిమా తొలి భాగం హిందీ డబ్బింగ్ హక్కులు 17.5 కోట్ల రూపాయలకు కొన్ని నెలల క్రితమే అమ్ముడయ్యాయని ఇప్పుడు ఈ డీల్ ను క్యాన్సిల్ చేసుకోవాలని ఈ సినిమా నిర్మాతలు భావిస్తున్నారని తెలుస్తోంది.
పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కుతుండటం, సినిమా ప్లాన్ లు మారడం, ఇతర కారణాల వల్ల సినిమాకు ఎక్కువ మొత్తం వచ్చే అవకాశం ఉండటంతో నిర్మాతలు డీల్ ను క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పుష్ప సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా భారీ యాక్షన్ మూవీ అయిన పుష్ప మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు బాలయ్య అఖండ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ 15 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
హిందీ యూట్యూబ్ మార్కెట్ లో బోయపాటి శ్రీను సినిమాలకు మంచి క్రేజ్ ఉండటంతో భారీ మొత్తానికి హిందీ డబ్బింగ్ హక్కులు అమ్ముడయ్యాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ విషయంలో బన్నీకి బాలయ్య గట్టి పోటీని ఇస్తున్నారనే చెప్పాలి. అఖండ సినిమా వినాయకచవితికి రిలీజవుతుందని వార్తలు వస్తుండగా పుష్ప సినిమా దసరాకు రిలీజవుతుందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. అయితే ఈ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి అధికారక ప్రకటనలు రావాల్సి ఉంది.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!