Akhanda Movie: యూఎస్ లో మరో రికార్డును అందుకున్న బాలయ్య!

నందమూరి బాలకృష్ణ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాడు. గత కొంతకాలంగా వరుస అపజయాలతో కాస్త సతమతమైన నందమూరి నటసింహం మొత్తానికి తన సత్తా ఏమిటో మరోసారి చూపించాడు. సింహా లెజెండ్ సినిమాల అనంతరం మరోసారి బోయపాటి శ్రీను కాంబినేషన్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. కేవలం తెలుగు గడ్డ పైన కాకుండా అమెరికా లో కూడా భారీ స్థాయిలో వసూళ్లను అందుకుని క్లాస్ ఆడియన్స్ చేత కూడా విజిల్స్ వేయించాడు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సినిమాకు మంచి హైప్ ఏర్పడింది. ఇక విడుదలైన తర్వాత అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చటంతో సినిమాకు వారం రోజుల్లోనే భారీ స్థాయిలో కలెక్షన్స్ అయితే వచ్చాయి. మొత్తానికి యూఎస్ లో కూడా అఖండ సినిమా 1 మిలియన్ డాలర్లను అడ్డుకోవడంలో సరికొత్త రికార్డును అందుకుంది.

అసలు ఈ సినిమా వన్ మిలియన్ డాలర్లను సాధిస్తుందా లేదా అనే అనుమానాలు చాలానే వస్తున్నాయి. ఇక ఈ తరుణంలోనే ఆ మార్కును అందుకుంది. ప్రస్తుతం కఠిన సమయంలో కూడా అఖండ సినిమా యూఎస్ లో మిలియన్ డాలర్లను దాటిపోవడం చాలా విశేషం అని చెప్పాలి. దాదాపు అన్ని ఏరియాల్లోనూ సినిమా పై పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వచ్చాయి. కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇంకా కొంత లాభాలు రావాల్సి ఉంది.

ఏదేమైనప్పటికీ కూడా నందమూరి బాలకృష్ణ తో పవర్ఫుల్ మాస్ కథతో సినిమా తీస్తే తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయవచ్చు అని బోయపాటి శ్రీను మరోసారి నిరూపించాడు. ఇక భవిష్యత్తులో కూడా వీరి కాంబినేషన్లో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ముందుగా అఖండ సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక బోయపాటి తన తదుపరి సినిమాను మరో అగ్ర హీరోతోనే చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus