అఖండ కథని మలుపు తిప్పిన చిన్నారి గురించి ఆసక్తికరమైన విషయాలు

నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ బాక్స్‌ఫీస్‌ను ఊచకోత కోస్తున్న సంగతి తెలిసిందే. సినిమా థియేటర్లో జాతర కొనసాగుతూనే ఉంది. విడుదలై వారం కావొస్తున్నా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ఆరో రోజు అఖండ లెక్కలు ఇంకా అఫీషియల్‌గా రాలేదు. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే మూడు కోట్ల వరకు కలెక్ట్ చేసేట్టు కనిపిస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఐదు రోజుల్లోనే 80 కోట్ల గ్రాస్ కొల్లగొట్టేసింది. ఆరో రోజు లెక్కలు కూడా కలుపుకుంటే..

అది 85 కోట్ల వరకు వెళ్లొచ్చని తెలుస్తోంది. అలా మొత్తానికి ఆరు రోజుల్లోనే దాదాపు 52 కోట్ల షేర్, 85 కోట్ల గ్రాస్ రాబట్టేట్టు కనిపిస్తోంది. బాలయ్య బోయపాటిలు తమ కాంబినేషన్‌కు తిరుగులేదని నిరూపించారు. ప్రగ్యా జైస్వాల్ అందచందాలు, శ్రీకాంత్ విలనిజం, ఫైట్లు సినిమాను ఎక్కడో నిలబెట్టాయి. ఇక ఈ సినిమాలోని చిన్నారి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలకృష్ణ కూతురుగా నటించిన బేబీ దేష్ణపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ నాడే ఈ పాప పాత్ర గురించి బోయపాటి తదితరులు చెప్పేశారు కూడా.

ఇప్పుడు ఆ మాటలే నిజం చేస్తూ సినిమా విజయంలో తన బుజ్జి చేయి వేసింది. ఇంతకీ ఆమె ఎవరు..? ఆమెకు ఈ అవకాశం ఎలా వచ్చింది అన్న దానిపై ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఓ ఇంటర్వ్యూ లో బేబీ దేష్ణ తల్లిదండ్రులు.. ‘‘అఖండ’’లో తమ కూతురికి ఎలా ఆఫర్ వచ్చింద చెప్పారు. తమ బిడ్డ ఫోటోలు ఇన్స్‌టా‌లో చూసిన సినిమా నిర్మాతలు ఈ ఆఫర్ ఇచ్చినట్లు వారు తెలిపారు. బేబీ దేష్ణకు తొలి అవకాశమే మంచి సినిమా వచ్చిందని.. బాలయ్య కూడా బేబీ దేష్ణను ముద్దు చేసేవారని ఆమె పేరేంట్స్ చెప్పారు. షూటింగ్ సమయంలో కూడా అందరు తమను కుటుంబ సభ్యులలాగా చేసుకున్నట్లు తెలిపారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus