Akhanda Collections: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘అఖండ’..!

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వచ్చిన `అఖండ` చిత్రం ఫుల్ రన్ ముగిసింది. ‘పుష్ప’ ‘శ్యామ్ సింగరాయ్’ వంటి పెద్ద చిత్రాలు పోటీగా రిలీజ్ అయినప్పటికీ…ఈ సంక్రాంతికి ‘బంగార్రాజు’ తో పాటు మరికొన్ని కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కూడా ఇంకా ఈ చిత్రం బాగానే క్యాష్ చేసుకుంది. ‘ద్వారకా క్రియేషన్స్‌’ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

దీంతో 8రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 50 రోజుల పాటు దిగ్విజయంగా పరుగుని కొనసాగించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 20.84 cr
సీడెడ్ 15.91 cr
ఉత్తరాంధ్ర  6.34 cr
ఈస్ట్  4.29 cr
వెస్ట్  4.03 cr
గుంటూరు  4.89 cr
కృష్ణా  3.67 cr
నెల్లూరు  2.67 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 62.64 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 10.65 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 73.29 cr

‘అఖండ’ చిత్రానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 8 రోజులకే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి … రూ.73.29 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవరాల్ గా చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి రూ.19.29 కోట్ల లాభాలు దక్కాయి.బాలయ్య- బోయపాటి ల కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా.. వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ కూడా కంప్లీట్ అయ్యింది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus