Akhanda Movie: బాలయ్య విషయంలో దిల్ రాజు రిస్క్ చేస్తున్నారా?

స్టార్ హీరో బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశాయి. ఈ కాంబినేషన్ లో మూడో సినిమాగా అఖండ సినిమా తెరకెక్కగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా నైజాం హక్కులను దిల్ రాజు కొనుగోలు చేసినట్లు సమాచారం. దిల్ రాజు ఈ సినిమా హక్కుల కోసం ఏకంగా 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది.

ఈ సినిమాలో బాలకృష్ణ కొంత సమయం అఘోరా పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజైన తర్వాత కలెక్షన్లపరంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండగా బాలకృష్ణ సినిమా నైజాం ఏరియాలో ఈ స్థాయిలో బిజినెస్ చేయడం గమనార్హం. కనీసం 22 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధిస్తే మాత్రమే నైజాం ఏరియాలో ఈ సినిమా హిట్ అనిపించుకుంటుందని చెప్పవచ్చు. ఈ సినిమా మేకర్స్ సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైంది. ఏపీలో త్వరలో టికెట్ రేట్లు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో టికెట్ రేట్లు పెరిగిన తర్వాత సినిమాను రిలీజ్ చేయాలని అఖండ మేకర్స్ భావిస్తున్నారు. అఖండలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్య జైస్వాల్ నటిస్తున్నారు. బోయపాటి శ్రీను ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో చేరుతుందని అనుకుంటున్నారు. ఈ ఏడాదే అఖండ రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus