Balakrishna: 200 కోట్ల క్లబ్ లో చేరిన బాలయ్య అఖండ!

స్టార్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ అంచనాలకు అందని స్థాయిలో సక్సెస్ సాధించింది. డిసెంబర్ నెల 2వ తేదీన విడుదలైన అఖండ మూవీ నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఏకంగా 103 సెంటర్లలో 50 రోజులు జరుపుకోవడం గమనార్హం. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు విడుదల కాకపోవడంతో అఖండ సినిమాకు ఈ అరుదైన రికార్డు సొంతమైంది. బాహుబలి తర్వాత ఈ రికార్డు సాధించిన సినిమా అఖండ మాత్రమేనని తెలుస్తోంది.

రాయలసీమలోని జిల్లాల్లో అఖండ సినిమా ఇప్పటికీ ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. కర్ణాటక, మహారాష్ట్రలోని పలు థియేటర్లలో కూడా అఖండ మూవీ 50 రోజులు ప్రదర్శించబడటం గమనార్హం. మరోవైపు ఈ సినిమా 200 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. ఈ సినిమాకు ఇప్పటివరకు 152 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూలు కాగా శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ హక్కుల రూపంలో మిగిలిన మొత్తం వచ్చాయని సమాచారం.

బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అయిన అఖండ బాలయ్య అభిమానులకు ఎంతగానో నచ్చింది. మరోవైపు రేపటినుంచి ఈ సినిమా హాట్ స్టార్ ఓటీటీలో అందుబాటులోకి రానుందని సమాచారం. అఖండ సినిమా ఇప్పటికీ పలు థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తుండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య అభిమానులు అఖండ సక్సెస్ సంబరాలను జరుపుకుంటున్నారు. బాలయ్య కెరీర్ లో అఖండ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.

అఖండలో బాలయ్య అభినయం న భూతో న భవిష్యత్ అనేలా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య తర్వాత సినిమా బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ నటిస్తున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus