Akhanda Hotel: అఖండ పేరుతో ఆ ఊరిలో హోటల్.. కానీ?

బాలయ్య నటించిన అఖండ మూవీ గతేడాది రిలీజైన సినిమాలలోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య, ప్రగ్యా జైస్వాల్, బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. పిల్లల నుంచి పెద్దల వరకు అఖండ సినిమాలో స్టార్ హీరో బాలకృష్ణ నటనకు ఫిదా అయ్యారు. ఓటీటీలో అఖండ స్ట్రీమింగ్ అవుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని పరిమిత సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది.

వీకెండ్ లో పలు థియేటర్లలో అఖండ హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోందని సమాచారం అందుతోంది. రాయలసీమలో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడం గమనార్హం. అయితే బాలయ్య అభిమానులు ఆయనపై ఉన్న అభిమానాన్ని ఊహించని విధంగా చాటుకున్నారు. అఖండ పేరుతో తిరుపతిలో బాలయ్య ఫ్యాన్ ఒకరు హోటల్ ను మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఈ హోటల్ కు సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది. ప్రస్తుతం తిరుపతిలో ఈ హోటల్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది.

కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన అఖండ ఊహించని స్థాయిలో కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో సక్సెస్ సెంటిమెంట్ ఈ సినిమాతో మరోసారి రిపీట్ అయింది. అఖండ తర్వాత బాలయ్య వరుస ప్రాజెక్టులకు ఓకే చెబుతూ కొత్త సినిమాలతో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం సీనియర్ హీరోలలో చిరంజీవి తర్వాత అదే స్థాయిలో ప్రాజెక్ట్ లతో బాలయ్య బిజీగా ఉన్నారు.

అఖండ పేరుతో హోటల్ ఏర్పాటు కావడంతో బాలయ్య అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. బాలయ్యపై ఉండే క్రేజ్ కు ఈ హోటల్ నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చే ఏడాది ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని బోగట్టా.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus