మారుతున్న కాలంతో పాటు తెలుగు సినిమా పరిశ్రమలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి చేరుకోవడేకాక, ప్రపంచమంతా గుర్తింపు తెచ్చుకుంది. ‘బాహుబలి’ సిరీస్, ‘పుష్ప’ సినిమాలు బాలీవుడ్ ని సైతం భయపెట్టాయంటే నార్త్ లో టాలీవుడ్ సినిమాల క్రేజ్ ఏ రేంజ్ లో ఉందనేది అర్థం చేసుకోవచ్చు.ఇక రాజమౌళి, ప్రభాస్ ‘బాహుబలి’తో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ట్రిపులార్ తో మరోసారి తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు జక్కన్న.
రీసెంట్ గా ఈ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్ జపాన్ లో రిలీజ్ అయింది. అక్కడి జనాలు ట్రిపులార్ టీం పట్ల, మన తెలుగు సినిమా పట్ల చూపించిన అభిమానం మాటల్లో చెప్పలేం.. ఇప్పుడు తెలుగు సినిమాకి మరో అరుదైన గౌరవం దక్కింది.. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తెలుగు సినిమాలకు పెద్దపీట వేశారు. నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరుగబోయే ఈ పాపులర్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెయిన్ స్ట్రీమ్ సినిమా సెక్షన్ లో బాలయ్య నటించిన బ్లాక్ బస్టర్ ‘అఖండ’,
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలను ఎంపిక చేసినట్లు ఇండియన్ పనోరమ వారు అధికారంగా ప్రకటించారు. పాండమిక్ తర్వాత బాలయ్య, బోయపాటిల కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ రప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే కాక.. తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఊపునీ, ఉత్సాహాన్నీ ఇచ్చింది. ఇక ట్రిపులార్ అయితే వరల్డ్ వైడ్ గానూ, ఓటీటీలోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
అలాగే.. ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన ‘సినిమా బండి’, విద్యా సాగర్ రాజు డైరెక్ట్ చేసిన ‘కుధిరం బోస్’ సినిమాలు ఎంపికయ్యాయి. అడవి శేష్, శశి కిరణ్ టిక్కాల కాంబోలో వచ్చిన ‘ది మేజర్’ మూవీ హిందీ వెర్షన్ కూడా స్క్రీనింగ్ కానుంది. గోవాలో జరుగనున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు..
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!